78ఏళ్ళ స్వాతంత్ర్య ఫలాలు పెట్టుబడిదారుల కోసమేనా -CPI .
జోగులాంబ గద్వాల 15 ఆగస్టు 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల. ఆంగ్లేయులతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు.. ఉద్యమాలతో వచ్చిన ఉపాధి హక్కులు.. ఉద్యోగ భద్రత.. కార్మిక హక్కులు నేడు లేకుండా చేస్తున్నారు -సీపీఐ జిల్లా కార్యదర్శి బి ఆంజనేయులు విమర్శించారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా పెద ప్రజలు,కష్టజీవుల భద్రత హక్కులకై పోరాటాలకు సమాయత్తం కావాలి. ప్రజలపై విచ్చల విడిగా పన్నుల విధానం విరమించాలని 78వ దేశ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా భారత కమ్యునిస్టు పార్టీ సిపిఐ పార్టీ జిల్లా కార్యాలయం ముందు అలాగే లారి హమాలీ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో, ట్రాన్స్పోర్ట్ హమాలీ యూనియన్ బాల్ భవన్ మందు గద్వాల పట్టణంలో జాతీయ పతాకాన్ని మువ్వన్నెల జెండాను సీపీఐ గద్వాల జిల్లా కార్యదర్శి బి ఆంజనేయులు ఎగురవెసి సబ్బండ వర్గాలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ స్వాతంత్రం కోసం పోరాడి వీర మరణం పొందిన అమరులను గుర్తు చేసుకొని వారికి విప్లవ జోహార్లు అర్పించారు. బ్రిటిష్ తెల్ల దొరలతో పోరాటాలు చేసి ఆనాడు కార్మిక హక్కులు చట్టాలు అమలు చేసుకోవడం జరిగిందని. కాని మన పరిపాలకులు పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను హరించి వేయడానికి 44 కార్మిక చట్టాలను కేవలం నాలుగు కోడులుగా కుదించికార్మికులను ఉద్యోగులను బానిసలుగా తయారు చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.సంపన్న వర్గాలకు పారిశ్రామికా బడా,పెట్టుబడిదారులకు ఊడిగం చేయడానికి కార్మికులను ఉద్యోగులను కార్మిక చట్టాలను హరించి వేసి బలి పశువులను చేయాలని చూస్తున్నారని అన్నారు.స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా,కార్మికులు,ఉద్యోగులు ఐక్య పోరాటాలకు ఉద్యోగ భద్రత ఉపాధి హక్కుల కార్మిక చట్టాల రక్షణకై,ఉద్యమించడానికి ప్రతిజ్ఞ చేయాలని కడారి సునీల్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో సిపిఐ జిల్లా సమితి సభ్యులు కాసీం,aisf కార్యదర్శి ప్రవీణ్, బైక్ రిక్షా కార్మికులు ప్రభుదాస్, తిమ్మప్ప, దర్మన్న,మెడికల్ యూనియన్ నాయకులు పర్శ, మతీన్, హమాలీ యూనియన్ నాయకులు మస్తాన్, వెంకట్రాముడు తదితరులు పాల్గొన్నారు.