ఏప్రిల్ మొదటి వారంలో ధాన్యం కోనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి

Mar 26, 2024 - 20:33
 0  2
ఏప్రిల్ మొదటి వారంలో ధాన్యం కోనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి

      యాసంగి 2023-24 వరి ధాన్యం కోనుగోలు కేంద్రాలను ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి మంగళవారం జిల్లా కలెక్టర్ బి. యం. సంతోష్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు అపూర్వ చౌహాన్, ఎం. వెంకటేశ్వర్లు  జిల్లా ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.  యాసంగి ధాన్యం కొనుగోలు, సిఎంఆర్ డెలివరీ, తాగునీటి ఎద్దడి తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సి. ఎస్. సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సంతోష్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అధికారులు మాత్రమే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని తెలిపారు. జిల్లాలో ఏప్రిల్ మొదటి వారంలో అన్ని మండలాల్లో
 ధాన్యం కొనుగోలు కేంద్రాలను పంట కోతలకు అనుగుణంగా ప్రారంభించాలని అన్నారు.ఎక్కడ ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకోకుండా చూడాలని, అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహిస్తూ రైతుల వద్ద నుంచి మద్దతు ధరపై ఎక్కడ ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియ ప్రణాళిక బద్ధంగా పూర్తి చేయాలని సూచించారు.  ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద అవసరమైన మౌళిక వసతులు, టార్ఫాలిన్లు, ప్యాడీ క్లీనర్లు, వేయింగ్ యంత్రాలు,  ఏర్పాటు చేయాలని, ధాన్యం నాణ్యత ప్రమాణాలు, తేమ శాతం
 పాటించాలన్నారు. ధాన్యం కొనుగోలు నిమిత్తం అవసరమైన వాహనాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి సంబంధిత మిల్లర్లకు కేటాయించాలని, రైస్ మిల్లు వద్ద ఎట్టి పరిస్థితుల్లో ధాన్యం కోత రాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైస్ మిల్లర్ల వద్ద హమాలీల కొరత రాకుండా జాగ్రత్త వహించాలని కోరారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలకు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం రైతులు ధాన్యాన్ని తీసుకుని వచ్చే విధంగా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.

      ఖరీఫ్ 2023-24 సీజన్ కు సంబంధించి  సీఎంఆర్ రా - రైస్ భారత ఆహార సంస్థకు సకాలంలో డెలివరీ చేసే విధంగా రైస్ మిల్లులను పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు.  

ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారిని రేవతి, డి ఆర్ డి ఓ నర్సింగరావు, డిపిఓ శంకర్ సింగ్, పౌరసరఫరాల జిల్లా  మేనేజర్ విమల, జిల్లా కో-ఆపరేటివ్ ఆఫీసర్ ప్రసాద్ రావు, వ్యవసాయ శాఖ అధికారి గోవింద్ నాయక్, మిషన్ భగీరథ ఈ ఈ శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333