పోలింగ్ సిబ్బంది మొదటి దశ ర్యాండమైజేషన్ పూర్తి : జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంక అలా.
జిల్లాలో జరిగే పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ సిబ్బంది మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసామని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంక అలా తెలిపారు . మంగళవారం ఐ డి ఓ సి వీడియో కాన్ఫరెన్స్ సమావేశమందిరం లో సంబంధిత అధికారులతో కలిసి ఎన్ఐసి వారు రూపొందించిన సాఫ్ట్ వేర్ వినియోగిస్తూ ఆన్లైన్ లో పోలింగ్ సిబ్బంది మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు.
జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంక అలా మాట్లాడుతూ జిల్లాలో కొత్తగూడెం , ఇల్లందు, పినపాక, భద్రాచలం మరియు అశ్వరావుపేట అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 962 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని,9 ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్లు ప్రపోజల్ నిమిత్తం రాష్ట్ర ఎన్నికల అధికారి గారికి పంపడం జరిగినది. మొదటి రాండమైజేషన్ ప్రక్రియలో భాగంగా1401 ప్రిసైడింగ్ అధికారులు,1401 సహాయక ప్రిసైడింగ్ అధికారులు, 2827 ఓపిఓలు ను కేటాయించడం జరుగుతుందన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు ప్రకారం అదనంగా సిబ్బంది కేటాయింపు ప్రక్రియ చేపట్టామని తెలిపారు.
ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ డి వేణుగోపాల్ ,ఎలక్షన్స్ సూపర్డెంట్ ధారా ప్రసాద్, రంగా ప్రసాద్, ఎన్ఐసి డిఐఓ సుశీల్ కుమార్, డిఎల్ఎంటి పి .సాయి కృష్ణ,ఎన్నికల సిబ్బంది నవీన్ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.