వర్షాలు అనే పద్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..... ఎస్సై ప్రవీణ్ కుమార్

Aug 8, 2025 - 16:25
 0  6
వర్షాలు అనే పద్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..... ఎస్సై ప్రవీణ్ కుమార్
మాట్లాడుతున్న ఎస్ఐ ప్రవీణ్ కుమార్..

మునగాల 08 ఆగస్టు 2024 

 తెలంగాణ వార్త ప్రతినిధి : - 

తెలంగాణ వ్యాప్తంగా రానున్న మూడు రోజులు విస్తారంగా వర్షాలు కురువనున్న నేపథ్యంలో మండల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని మునగాల మండల ఎస్సై ప్రవీణ్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.వర్షం కారణంగా ప్రయాణ సమయంలో వాహనాలు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉన్నందున పరిమిత వేగంతో నడపాల‌ని సూచించారు.చెట్ల కింద, పాడైన భవనాల‌ కింద, శిథిలావస్థలో ఉన్న భవనాల్లో ఉండరాదన్నారు.అలాగే వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు కరెంట్‌ వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యుత్‌ స్థంభాలు, ట్రాన్స్‌ఫార్మ‌ర్స్ ముట్టుకోవ‌ద్ద‌న్నారు. ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులు, కాల్వ‌లు, నదులు, రిజర్వాయర్లు, చెరువుల వద్దకు వెళ్ల‌వ‌ద్ద‌న్నారు. నదులు, వాగుల్లోకి చేపల వేటకు వెళ్లవద్దని తెలిపారు. పిల్లలను, వృద్ధులను ఒంటరిగా బయటకు పంపవద్దన్నారు. పోలీస్‌ శాఖ 24 గంటల పాటు అప్రమత్తంగా ఉంటుంద‌ని, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కి కాల్ చేయాలని ఎస్సై మండల ప్రజలకు సూచించారు.గ్రామీణ ప్రాంతాల్లో కల్వర్టుల పరిసర ప్రాంతంలో ఉండవద్దని కోరారు. యువకులు చెరువులు వాగుల్లో చేపలు పట్టేందుకు వెళ్ళావద్దన్నారు. గొర్ల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని చెట్ల ఉండకూడదని పేర్కొన్నారు.

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State