ఎస్ సి కాలనీలో త్రాగునీటి బోర్ వెల్

Jan 12, 2026 - 19:11
Jan 12, 2026 - 20:18
 0  17
ఎస్ సి కాలనీలో త్రాగునీటి బోర్ వెల్

ఎస్ సి కాలనీలో త్రాగునీటి బోర్ వెల్

*సర్పంచ్ వాసం రాజబాబు*

చెరుకూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ వాసం రాజబాబు గ్రామ అభివృద్ధి పట్ల తన నిబద్ధతను మరోసారి చాటుకున్నారు. చెరుకూరు పంచాయతీ పరిధిలోని ఎస్.సి కాలనీలో ఈరోజు బోర్ వెల్ పనులను విజయవంతంగా పూర్తిచేశారు.

పంచాయతీ ఎన్నికల సమయంలో ఎస్.సి కాలనీ ప్రజలకు “తాగునీటి సమస్యను పరిష్కరిస్తాను, బోర్ వెల్ కొట్టిస్తాను” అని ఇచ్చిన హామీని సర్పంచ్ నెరవేర్చారు. ప్రస్తుతం పంచాయతీకి సంబంధించిన నిధులు ఇంకా అందుబాటులోకి రాకపోయినా, ప్రజల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని తన స్వంత ఖర్చులతోనే బోర్ వెల్ పనులను చేపట్టడం విశేషం.

ఈ బోర్ వెల్ పనుల సమయంలో మంచి నీరు పడటం కాలనీ ప్రజలకు ఎంతో ఆనందాన్ని, ఊరటనిచ్చే విషయం. గత కొంతకాలంగా తాగునీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న ఎస్.సి కాలనీ వాసులకు ఇది పెద్ద ఉపశమనంగా మారింది. బోర్ వెల్ ద్వారా శుద్ధమైన నీరు అందుబాటులోకి రావడం వల్ల రోజువారీ అవసరాలు సులభంగా తీరనున్నాయి.

ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, వార్డు సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బోర్ వెల్ పనులు పూర్తయ్యి నీరు పడిన వెంటనే గ్రామ ప్రజలు సర్పంచ్ ని అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం, ప్రజల సమస్యలను స్వయంగా ముందుకొచ్చి పరిష్కరించడం నిజమైన నాయకత్వానికి నిదర్శనమని వారు ప్రశంసించారు.

గ్రామ అభివృద్ధి, ముఖ్యంగా వెనుకబడిన కాలనీల సంక్షేమం పట్ల సర్పంచ్ వాసం రాజబాబు గారు చూపిస్తున్న చిత్తశుద్ధి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తోంది. భవిష్యత్తులో కూడా చెరుకూరు గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

Alli Prashanth kumar భద్రాద్రి కొత్తగూడెం ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్