పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి పిర్యాదు పై వెంటనే చర్యలు చేపట్టాలి -జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు

Jul 22, 2024 - 20:11
 0  7
పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి పిర్యాదు పై వెంటనే చర్యలు చేపట్టాలి -జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు

గద్వాల:- పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి పిర్యాదుపై త్వరితగతిన విచారణ చేపట్టి చట్ట ప్రకారం పరిష్కరించాలని, అలాగే సివిల్   వివాదాలు  పోలీస్ స్టేషన్ లలో పరిష్కరించబడవు అనే విషయాన్నీ పిర్యాదులకు  తెలియజేయాలని  జిల్లా ఎస్పీ టి.శ్రీనివాస రావు పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి లో బాగంగా జిల్లా పోలీసు కార్యాలయంకు వచ్చిన 16 పిర్యాదులను జిల్లా ఎస్పీ డి .ఎస్పి సత్యనారాయణ తో కలిసి స్వీకరించారు.వారి సమస్యలను సావధానంగా విన్న జిల్లా ఎస్పీ సంబంధిత పోలీసు అధికారులతో ప్రత్యక్షంగా  మాట్లాడి బాధితుల ఫిర్యాదులను  వెంటనే విచారణ చేపట్టి చట్ట ప్రకారం పరిష్కరించాలని, సునిశితమైన అంశాలకు సంబంధించిన పిర్యాదుల విషయంలో కౌన్సిలింగ్ నిర్వహించాలని, సివిల్  వివాదాలకు సంబంధించిన ఎటువంటి ఫిర్యాదులు అయినా కోర్టు ద్వారానే పరిష్కరించుకునేటట్లు పిర్యాదు దారులకు తెలియజేయాలని  ఆదేశించారు. ఆలంపూర్, గద్వాల్ , శాంతిన గర్ సర్కిల్ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ రోజు వచ్చిన పిర్యాదుల లో 1).భూ వివాదాలకు సంబందించి 09 పిర్యాదులు,

2). అప్పుగా తీసుకున్నా డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని -03 పిర్యాదులు.
03. వేసిన పంటలను నాశనం చెయ్యటం గురించి -03 పిర్యాదులు.

4. ఇతర అంశాలకు 01 సంబంధించి ఫిర్యాదు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333