ఎర్రవల్లి శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ CBSE స్కూల్ నందు ఫుడ్ ఫెస్ట్ .. కార్యక్రమం

Nov 15, 2025 - 19:21
 0  15

 జోగులాంబ గద్వాల 15 నవంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి :  ఎర్రవల్లి. పాఠశాల చిన్నారులు 260 కి పైగా విద్యార్థులు వారి యొక్క ఇంటి వంటకాలను తీసుకువచ్చి ఫుడ్ ఫెస్ట్ కార్యక్రమంలో స్టాల్స్ రూపంలో పెట్టి వంటకాలను అతిథులకు తోటి స్నేహితులకు విద్యార్థుల తల్లిదండ్రులకు చిన్న మొత్తంలో అమ్మకాలకు మొదలుపెట్టడం జరిగినది. అలా చేస్తున్న చిన్నారులను  చూసి చాలా సంతోషించారు ముచ్చటించారు కొంత మొత్తంలో అమౌంటు మరియు ఫోన్ పే రూపంలో విద్యార్థులకు అమౌంట్ పంపించి కావలసిన ఆహార పదార్థాలను తీసుకొని టేస్ట్ చేశారు పాఠశాల చైర్మన్ శ్రీ వీర గోవర్ధన్ రెడ్డి విద్యార్థులకు మరియు విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యార్థులను అన్ని విధాలలో మన ప్రోత్సాహం ఉంటే వారి భవిష్యత్తును వారే నిర్మించుకోవడంలో కీలక పాత్రులు అవుతారని అన్నారు.  కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గద్వాల్ సంస్కార్ స్కూల్ ప్రిన్సిపల్ సంధ్యా రెడ్డి మొదటగా రిబ్బన్ కటింగ్ పూజ కార్యక్రమం చేసి ప్రారంభించడం జరిగినది. వారితో ముచ్చటించిన సంధ్యారెడ్డి తరువాత విద్యార్థులు తీసుకువచ్చిన స్వచ్ఛమైన ఆహార పదార్థాలను మరియు స్టాల్స్ రూపంలో ఉన్న ఫ్యాషన్, స్టేషనరీ విద్యార్థులకు కావలసిన ప్రతిదీ అందుబాటులో ఉండేటట్లు స్టాల్స్ ను పెట్టడాన్ని చూసి అందర్నీ అభినందించడం జరిగినది. 

    ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ శ్రీ వీర గోవర్ధన్ రెడ్డి, డైరెక్టర్ శ్రీ వీర శ్రీనివాస్ రెడ్డి, కరస్పాండెంట్ శ్రీమతి మధులిక రెడ్డి, గద్వాల్ సంస్కార్ స్కూల్ ప్రిన్సిపల్ సంధ్యారెడ్డి, వైస్ ప్రిన్సిపల్ మహిమ శ్రీ ఉపాధ్యాయులు సురక్షిని, ఆంజనేయులు, నాగరాజు, వ్యాయామ ఉపాధ్యాయులు ప్రియాంక లాలు నరేంద్ర వంశీకృష్ణ కిరణ్ మరియు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333