అడ్డగూడూరులో 3వ విడత సామాజిక తనికి ప్రజా వేదిక
అడ్డగూడూరు 09 సెప్టెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:-యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో 3వ విడత సామాజిక తనిఖీ ప్రజా వేదిక ఎంపీడీఓ శంకరయ్య అధ్యక్షతన సోమవారంరోజు నిర్వహించడం జరిగింది. మండలంలోని 17 గ్రామాల గ్రామస్థాయి ఆడిట్ నివేదికను సామాజిక తనిఖీ డిఆర్పిలు ప్రజా వేదికలో సమర్పించడం జరిగింది.పనుల నిర్వహణలో లోపం వహించిన ఫీల్డ్ అసిస్టెంట్ల ను ప్రోసైడింగ్ అధికారి మల్లేశం హెచ్చరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో అడిషనల్ డి.ఆర్.డి.ఓ సురేష్,అసిస్టెంట్ విజిలెన్స్ మేనేజర్ ఆదిత్య, అంబుడ్స్ మెన్ వీరమల్లు,ఎంపీడీఓ పి శంకరయ్య,ఎంపీవో ప్రేమలత, ఎస్ఆర్పి స్వామి టీఏలు అశోక్ వెంకట్ రెడ్డి, శృతి అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులు,ఫీల్డ్ అసిస్టెంట్ లు పాల్గొన్నారు. కాళిక్యూలేషన్ చేయడంలో లోపం కారణముగా టిఏలకు రూ.2573.00లు సివోలకు 857.00 రూ.లు ఈసీకి 565.00రూ.లు పిఎస్ లకు 6655.00 రూ.లు
ఎఫ్ఎలకు1848.00లు రూ.415.00 విధులలో నిర్లక్ష్యం వహించినందుకు రికవరీ కి ఆదేశించినారు.