చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
జూలై 8 తెలంగాణ వార్త ప్రతినిధి :- ములుగు జిల్లా వాజేడు మండలం గుమ్మడిదొడ్డి బొగత జలపాతం వద్ద వాజేడు రేంజ్ ఆఫీసర్ చంద్రమౌళి సహకారం తో బొగత సెక్షన్ ఆఫీసర్ గొంది నారాయణ బొగత బీట్ ఆఫీసర్ కవిత ఆధ్వర్యంలో 20 యూనిట్ల రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి నాగారం ప్రభుత్వ ఆసుపత్రి వారికి ఇవ్వడం జరిగింది.
ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో పాటు చీకుపల్లి యువత గుమ్మడిదొడ్డి యువత రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు బొగత సిబ్బంది కూడా రక్తదానం చేశారు గుమ్మడిదొడ్డి యూత్ లీడర్ బోదే బోయిన భరత్ చీకుపల్లి యూత్ లీడర్ బోధ బోయిన వికాస్ , నగరం ప్రభుత్వ సిబ్బంది మల్లికా మురళి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు