కాంగ్రెస్ ఇచ్చిన ఏడవ హామీ ఏమైంది.సీఐటీయూ
జోగులాంబ గద్వాల 25 మార్చి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏడవ హామీ ఏమైందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్పేర్ నరసింహ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని స్థానిక YSR చౌరస్తా లో నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్బంగా ఆశా వర్కర్లకు 18000 ఫిక్స్డ్ వేతనం ఇస్తామని హామీ ఇచ్చారని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని మార్చి 24 న చలో అసెంబ్లీ కార్యక్రమానికి ఆశా కార్యకర్తలు పిలుపు ఇచ్చారని అన్నారు ప్రభుత్వం చలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్లకుండా 23 తేదీ నుంచే అర్థ రాత్రి ఆశా వర్కర్లను అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని, చివరికి ఆశా కార్యకర్తల కుటుంబ సభ్యులను వదలకుండా ఇబ్బందులకు గురి చేశారని విమర్శించారు. చలో అసెంబ్లీ సందర్భంగా మహిళలు అని చూడకుండా కర్కశంగా వ్యవహరిస్తూ పురుష పోలీసులు అరెస్టు చేశారని విమర్శించారు. అరెస్టు చేసిన ఆశాలను సైతం కొన్ని చోట్ల పోలీసు స్టేషన్ కు తరలించకుండ వాహనాలలో నుంచి మధ్యలోనే ఆశాలని వదిలి వేశారని విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా పోరాడుతున్న మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించడమే ఇందిరమ్మ రాజ్యమా అని ప్రశ్నించారు.? తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని ప్రజలు కార్మికుల హక్కుల పరిరక్షణకు హామీగా ఉంటామని చెప్పిన ప్రభుత్వం తన భూస్వామ్య విధానాలను కొనసాగిస్తూ ఉద్యమాలను నిరంకుశంగా అణచి వేస్తున్నదని విమర్శించారు నేటి నిరసన కార్యక్రమాలు సైతం చేయకుండా పలు మండలాల్లో ఆశా వర్కర్లను అడ్డుకోవడం దేనికి సంకేతం అని ప్రశ్నించారు.? ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో అశాలకు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించి అమలు చేయాలని లేని పక్షంలో దీర్ఘ కాలం ఉద్యమాలకు సిద్దమవుతామని హెచ్చరించారు .
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పద్మ సునీత ఉపాధ్యక్షులు నాగ ప్రమీల ఆశాలు పద్మ కవిత శ్రీదేవి రేణుక నరసింగమ్మ సునీత శ్వేత జయమ్మ తదితరులు పాల్గొన్నారు.