ఈ రోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లి డబుల్ రూమ్ ప్రాంతంలో శ్రీహరి  ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర జాతీయ పౌర సరఫరాల పతాకం

Jan 13, 2026 - 19:05
 0  1
ఈ రోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లి డబుల్ రూమ్ ప్రాంతంలో శ్రీహరి  ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర జాతీయ పౌర సరఫరాల పతాకం

 దుకాణాన్ని (3307012) నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి  ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, తెలంగాణ వార్త, ప్రతి నిధి : ఈ సందర్భంగా హన్మంతన్న మాట్లాడుతూ, పేద ప్రజలకు నాణ్యమైన సన్న బియ్యం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. ప్రతి అర్హ కుటుంబానికి ఆహార భద్రత కార్డు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ నిరంతరం పనిచేస్తుందని, పేదల అభ్యున్నతే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు బాల బ్రహ్మచారి, సిద్దనోళ్ల సంజీవ రెడ్డి, ఆలేటి శ్రీనివాస్ రావు, మైసిగారి శ్రీనివాస్, రాంచందర్ నాయక్, మల్లికార్జున్, ఆది రెడ్డి, రహీమ్ భాయ్, శేఖర్, శ్రీను, డబుల్ బెడ్ రూమ్ వాసులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333