రాత్రి పూట వరుస దొంగతనాలపై గస్తీ, విధి పోలీసులను కేటాయించాలి.
సిపిఐ జిల్లా కార్యదర్శి బి ఆంజనేయులు .
జోగులాంబ గద్వాల 4 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- రాత్రి పోలీసుల వైఫల్యాలు స్పష్టంగా కన్పిస్తున్నాయిని సీపీఐ జిల్లా కార్యదర్శి బి ఆంజనేయులు పేర్కొన్నారు ఈమెరకు గురువారం ఆయన మాట్లాడారు ఇప్పటివరకు ఎంత మంది
దొంగలపై, క్రిమినల్స్ పై చర్యలు తీసుకున్నారో ప్రజలుకు తెలియాల్సిన అవసరం ఉంది,ప్రజల భయంతో అయోమయం చెందుతున్నారని కొన్ని నెలలుగా ఇలాంటి దొంగతనాలు సంఘటనలు జరుగుతున్నాయని దీనిపై పోలీస్ శాఖ ఏకేసులో ఎంత వరకు పురోగతి సంధించిందో ప్రజలకు చెప్పనందున పైగా జాగ్రత్తగా ఉండలని ఆటోల ద్వారా ప్రచారం చేయటంవలన కొంత ప్రజలు ఇంకా ఆందోళనకు గురువుతున్నారని పేర్కొన్నారు.
జిల్లా ఏర్పడిన తర్వాతే దొంగతనాలు ఎక్కువైనాయన్నారు. రాత్రి పూట విధి గల్లీ పెట్రోలింగ్ పోలీసులను ఏర్పారచి నిఘా పరివేక్షణ చేయాలని కోరారు. రాత్రి ఎమర్జెన్స్ టీమ్ అండ్ నెంబర్ కేటాయించి సంఘటనల పట్ల స్పాట్ లో వెళ్లి బాధితులకు రక్షణ కల్పించే విధంగా ఉండాలన్నారు గతంలో
SP విజయకుమార్ ఉన్నప్పుడు దొంగలకు దౌర్జన్య కారులకు ధడా పుట్టించారని తెలిపారు.
ఫైరవికారుల, బ్రోకర్ల దంధాలపై కఠినంగా వ్యవహారించాలన్నారు
Sp ఆఫీస్ కీ ఖాద్దార్ చొక్కాలతో కార్లతో వచ్చేవారికే కాకుండా బైక్ లపై వచ్చే సామాన్యులకు ఉద్యమకారులకు కూడా అనుమతి,అవకాశం ఇవ్వాలని కోరారు .
ఒత్తిడిలకు తాలోగ్గకుండా పిర్యాదులు వచ్చిన వెంటనే పరిస్కారం చేయాలని డిమాండ్ చేశారు.
జిల్లాలో జరిగే అన్ని దొంగతనాలకు అక్రమ దందాలను ఉక్కుపాదంతో అణిచివేయాలని పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈకార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం అశన్న,కాశీం, ప్రవీణ్, అనుమేష్ తదితరులు పాల్గొన్నారు.