డీజేఎఫ్(డబ్ల్యూ) హాలో జర్నలిస్ట్–చలో కలెక్టరేట్

Dec 27, 2025 - 16:22
 0  42
డీజేఎఫ్(డబ్ల్యూ) హాలో జర్నలిస్ట్–చలో కలెక్టరేట్
డీజేఎఫ్(డబ్ల్యూ) హాలో జర్నలిస్ట్–చలో కలెక్టరేట్

అడ్డగూడూరు 26 డిసెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– రాష్ట్ర ప్రభుత్వం నూతన అక్రిడిటేషన్ల కోసం జారీ చేసిన జీవో నెంబర్ 252ను తక్షణమే సవరించాలని మరియు అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ.. (శనివారం)డీజేఎఫ్ డబ్ల్యూ ఆధ్వర్యంలో రేపు ఉదయం 10:30 గంటలకు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేయాలని రాష్ట్ర కమిటీ పిలుపుని విజయవంతం చేయడానికి జిల్లా, మండల జర్నలిస్టులు తరలిరావాలని విజ్ఞప్తి చేస్తున్నాం.ముఖ్య డిమాండ్లు జీవో నెంబర్ 252 సవరణ,జర్నలిస్టుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే నిబంధనలను తొలగించాలి!డెస్క్ జర్నలిస్టులు చిన్న పత్రిక పెద్ద పత్రిక అనే తేడా లేకుండా జర్నలిస్టులు అందరినీ మీడియా అక్రిడిటెడ్ జర్నలిస్టులుగా గుర్తించాలి.జర్నలిస్టుల ఉపాధిని,గౌరవాన్ని కాపాడే విధంగా నూతన మార్గదర్శకాలు ఉండాలి.ఈ కార్యక్రమంలో జిల్లాలోని ప్రింట్,ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియా జర్నలిస్టులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతూ...మన హక్కుల సాధన కోసం సాగుతున్న ఈ పోరాటంలో అందరూ కలిసికట్టుగా రావాలని పిలుపునిస్తున్న అడ్డగూడూరు(డి.జే.ఎఫ్. డబ్ల్యూ)డెమెట్రిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వర్కింగ్ మాజీ తాజా మండల అధ్యక్షుడు కడియం రవివర్మ పిలుపునిచ్చారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333