ఎత్తిపోతల పథకాలకు నిధులు మంజూరి చేయాలి""సిపిఎం జిల్లా నాయకులు

తెలంగాణ వార్తా ప్రతినిధి కోదాడ : ఎత్తిపోతల పథకాలకు నిధులు మంజూరు చేయాలి కోదాడ నియోజకవర్గంలో సాగర్ ఎడమకాలపై ఉన్న ఎత్తిపోతల పథకాలకు నిధులు మంజూరు చేయాలని సిపిఎం జిల్లా నాయకులు( కొక్కిరేణి లిఫ్ట్ చైర్మన్) మేదరమెట్ల వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
స్థానిక కోదాడ పట్టణంలో వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల కార్యక్రమానికి వచ్చిన స్థానిక కోదాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉత్తం పద్మావతి రెడ్డి గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గం లోసాగర్ ఎడమకాలపై గల ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్లు మోటర్లు స్టార్టర్లు ట్రాన్స్ఫారాలు సివిల్ కాలువలు శిథిలావస్థలో ఉన్నాయని, వాటిని మరమ్మతులు చేయించి పూర్తి ఆయకట్టుకు నీరు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారన్నారు. నేడు సాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల చేస్తున్నందువలన వాటితోపాటు లిఫ్ట్రిగేషన్ ఆయకట్టుకు నీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని వారన్నారు. యొక్క కార్యక్రమంలో కొక్కిరేణి మాజీ సర్పంచ్ ఒక్క పంతుల ప్రభాకర్ రావు. మిట్టగనుపుల ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.