జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో గొప్పది.
ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ నాగరిగారి ప్రీతం.
మహాసభను విజయవంతం చేయాలి.
తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల నాగేందర్ మాదిగ.
హైదరాబాద్, జూలై 18: జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంతోపాటు వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు శుక్రవారం హైదరాబాదులోని సచివాలయంలో ఆగస్టు 12న హైదరాబాద్ రవీంద్రభారతిలో జరగబోయే తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర రెండవ మహాసభల పోస్టర్ ను ఆ సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు బూరుగుల నాగేందర్ మాదిగతో కలిసి ఆవిష్కరించి మాట్లాడారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంలో ముందు ఉంటానన్నారు. ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ నాగరి గారి ప్రీతం డి ఎస్ ఎస్ భవన్ లో పోస్టర్ ను ఆవిష్కరించి మాట్లాడారు. సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో గొప్పదని అభివర్ణించారు. వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు నాగేందర్ మాదిగ మాట్లాడుతూ రెండో రాష్ట్ర మహాసభలకు రాష్ట్రం నలుమూలల నుండి మాదిగ, అనుబంధకులాల జర్నలిస్టులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కల్లపల్లి రాజేందర్, ఉపాధ్యక్షులు మైలారపు ప్రేమ్ కుమార్, బొల్లెపాక రాజేష్, రాష్ట్ర కార్యదర్శులు అంకగళ్ల కరుణాకర్, సుక్క అశోక్ , దుబ్బ నాగేష్, రాష్ట్ర నాయకులు బోట్ల సదానందం, బొల్లె రాజన్న, మంచాల అనిల్, లంక స్వామి, నలవాల మహారాయుడు, సిరిసిల్ల అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.