ఎంబీబీఎస్ సీటు సాధించిన విజయ్ స్వరూప దంపతుల కూతురు పి.సానియా
ఒక ప్రక్క డాక్టర్ కావాలనే ఆశయం - మరో ప్రక్క ఆర్థిక ఇబ్బందులతో మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి
మానవతావాదులు ఆర్థికంగా సహకరించాలని విద్యార్థిని పి.సానియా కన్నీటి ఆవేదనతో ఎదురుచూపులు
జోగులాంబ గద్వాల21 అక్టోబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ఇటిక్యాల మండలం ఉదండాపురం గ్రామానికి చెందిన విజయ్ స్వరూప దంపతుల కూతురు పి.సానియా హైదరాబాదులోని గండి మైసమ్మ, మేడ్చల్ రోడ్డు అరుంధతి మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించడం జరిగింది. విద్యార్థిని పి సానియా డాక్టర్ కావాలని సంకల్పంతో చదవాలనే కోరిక ఉన్నా కానీ ఆర్థిక ఇబ్బందులతో, కుటుంబ ఆర్థిక పరిస్థితుల ఇబ్బందుల వల్ల ఎంబిబిఎస్ కోర్సు చేయలేను అనే బాధతో,దీనావస్థలో ఉంటూ దాతలకై ఎదురుచూస్తుంది. పి.సానియా యొక్క ఎంబిబిఎస్ సీటు కి సంబంధించి అరుంధతి మెడికల్ కళాశాలలో ఒక్క సంవత్సరం కి వచ్చేసి కాలేజ్ ఫీజు 60,000 వేలు,హాస్టల్ ఫీజు 1,65,000,మరొక ఫీజు 30000 వేలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఇలా ఐదున్నర సంవత్సరాలు డబ్బులు కట్టలేక పోవడంతో ఎంబీబీఎస్ సీటు ను మధ్యలోనే వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.నా యొక్క ఆర్థిక ఇబ్బందులను అర్థం చేసుకొని ఎంబిబిఎస్ చదవడానికి మానవతావాదులు,దాతలు ఆర్థికంగా సహకరించాలని కోరుతుంది.
సంప్రదించాల్సిన నెంబర్ : విద్యార్థిని తండ్రి విజయ్ : 7780466424. విద్యార్థిని వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.