100% ఉత్తీర్ణత సాధించాలి: జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్..
గట్టు (అక్టోబర్ 21): జోగులాంబ గద్వాల జిల్లా గట్టు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రవీందర్ సోమవారం సందర్శించారు.ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ.. రాబోయే పబ్లిక్ పరీక్షల్లో ప్రతి ఒక్కరు ఉత్తీర్ణత సాధించాలన్నారు..మీరు కష్టపడి చదివితే ఆ ఫలితాలు భవిష్యత్తులో ప్రతిబింబిస్తాయన్నారు.. ఆ దిశగా కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు... ఈ కార్యక్రమంలోపాఠశాల ప్రధానోపాధ్యాయులు,ఎమ్ ఈఓ నల్లా రెడ్డి, జిల్లా సమన్వయ అధికారి హంపయ్య , ఎస్తేరు రాణి జిల్లా విద్యాశాఖ కార్యాలయ పర్యవేక్షకులు రామకృష్ణారావు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.