కామ్రేడ్ కమ్మంపాటి వెంకన్నకు విప్లవ జోహార్లు.సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్

తెలంగాణ వార్త:- కడదాకా కమ్యూనిస్టుగా జీవించిన కామ్రేడ్ కమ్మంపాటి వెంకన్నకు విప్లవ జోహార్లు. సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ కడదాకా కమ్యూనిస్ట్ గా జీవించిన వ్యక్తి కామ్రేడ్ ఖమ్మంపాటి వెంకన్న అని సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గడ్డం సదానందం, జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివ కుమార్ అన్నారు. ఈ రోజు అమ్మనబోలు మండల కేంద్రంలో సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మంపాటి వెంకన్న సంతాప సభ అనంతోజు నర్సింహచారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వెంకన్న తాను కరిగి పోతూ వెలుగునిచ్చిన వెలుగు, రక్త బంధం కన్నా వర్గ సంబందం ఎంతో విలువైనది అని కొనియాడారు.వెంకన్న కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.వెంకన్న ఆశయాలను ముందుకు తీసుకుపోవడమే మనం ఆయనకిచ్చే నిజమైన నివాళి అన్నారు.పిఓడబ్ల్యు రాష్ట్ర నాయ కురాలు కొత్తపల్లి రేణుక, పిడిఎస్యు రాష్ట్ర సహాయ కార్య దర్శి ఎర్ర అఖిల్ కుమా ర్, శీలం స్వామి, పేర్ల నాగయ్య, గొడ్డలి నర్సన్న, అమ్మనబోలు మాజీ సర్పంచ్ కట్టంగూరి సత్తయ్య, రాంరెడ్డి, పద్మారావు,సిద్దులు బందు మితృలు, కుటుంబ సభ్యులు పాల్గొని కమ్మంపాటి వెంకన్న త్యాగాలను కమ్యూనిస్టు విప్లవ రాజకీయ జీవితాన్ని నెమరు వేసుకొని ఆయనకు విప్లవ జోహార్లు అర్పించారు.