ఎంపీడీవో ఆఫీసులో జడ్పిటిసి, ఎంపీటిసి, ఓటర్ లిస్ట్ ఫైనల్ వెరిఫికేషన్

చిన్నంబావి మండలం తెలంగాణ వార్త : చిన్నంబావి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం జడ్పిటిసి, ఎంపీటిసి ఓటర్ లిస్ట్ ఫైనల్ వెరిఫికేషన్ కార్యక్రమం ఎంపీడీవో రామస్వామి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఎలక్షన్ డ్రాఫ్ట్ పబ్లికేషన్, ఓటర్ జాబితాలో అభ్యంతరాలు, సవరణలు వంటి అంశాలపై అన్ని పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, ఖచ్చితత్వం కోసం సూచనలు కోరారు. ఈ సమావేశంలో బీజేపీ పార్టీ తరఫున చిన్నంబావి మండల అధ్యక్షుడు బొగ్గు కురుమయ్య, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు కత్తి జానీ పాల్గొన్నారు. వారు ఓటర్ జాబితాలో ఉన్న లోపాలను సరిదిద్దాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఎంపీడీవో రామస్వామి తో చర్చించడం సూచనలు ఇవ్వడం జరిగింది.