అక్షరాస్యతపై విద్యార్థులకు ఉన్న అవగాహన గురించి అడిగి తెలుసుకుంటున్న
అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం
కొప్పునూరు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రవీందర్ రెడ్డి
చిన్నంబావి మండలం తెలంగాణ వార్త : చిన్నంబావి మండల పరిధిలోని కొప్పునూర్ ఎస్సీ బాలుర హాస్టల్లో సోమవారం ఉదయం అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రవీందర్ రెడ్డి మొదటగా చదువు గురించి విద్యార్థులకు ఉన్న పూర్వ జ్ఞానాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ - విద్య ప్రతి ఒక్కరు నేర్చుకోవడం ఎంతో అవసరం మన హక్కుల గురించి జ్ఞానాన్ని అందిస్తుంది. సరైన నిర్ణయాలు, సరియైన సమయంలో తీసుకోవడానికి మార్గనిర్దేశం చేస్తుంది. క్రమశిక్షణ, విలువలను నేర్పిస్తుంది. పేదరికంలో మగ్గుతున్న పేదవారిని ధనవంతులుగా మారడానికి సహకరిస్తుంది. అంతేకాక దేశభక్తి, నైతిక విలువలు పాటించే లక్షణాలు అభివృద్ధి చెందుతాయి. అధ్యాత్మికంగా, వ్యక్తిగతంగా మనల్ని నడిపిస్తుంది. జీవన నాణ్యత పెరిగి సరియైన మార్గంలో నడవడానికి సహకరిస్తుంది. క్రమశిక్షణ విలువలు నేర్పిస్తుంది. ప్రపంచoలో ఈ నాటికి 750 మిలియన్ల బాలలు, పౌరులు నీ్రక్షారాస్యులుగానే ఉన్నారు. మన దేశంలోనే ఇప్పటికి రాజస్థాన్, బీహార్ రాష్ట్రాలు అక్షరాస్యత విషయంలో వెనుకబడే ఉన్నాయి. మన దేశంలో బాలలకు విద్య అనేది ప్రాథమిక హక్కు అనే చట్టం చేశారు. విద్యను అభ్యసిo చడానికి వయోపరిమితి లేదు. అందుకే కేవలం బాలలే కాకుండా, పెద్ద వయస్కులు కూడా దగ్గరలోని రాత్రివేల వయోజన విద్యా కేంద్రాలకు వెళ్లి కనీసం చదవడం, రాయడమైనా నేర్చుకోవాలి. చదువరాని వారు బయటి ప్రదేశాలలో ఎన్ని కష్టాలు పడుతున్నామో మనం చూస్తూనే ఉన్నాము. ఏ ఊరు వెళ్లాలన్న బస్సు మీద ఉన్న బోర్డు చదవలేక ఇతరులపై ఆధారపడుతున్నాము. ఒక ఉత్తరం వచ్చిన స్వయంగా చదవలేము. ఆర్థిక విషయాలలో మోసానికి గురయ్యే అవకాశం ఉంది. ప్రతి రోజు సమాజంలో ఏమి జరుగుతుందో పేపర్లలో వచ్చే వార్తలు చదవలేక ఏమి తెలుసుకోలేక వెనుకపడిపోతున్నారు.. అలాగే, ఈనాడు కాలేజీకి వెళ్లి చదువకోలేని వారికీ, ఉద్యోగస్తులకు ఓపెన్ యూనివర్సిటీ, దూర విద్య ద్వారా చదువుకోవడానికి అవకాశం కల్పించారు. కనుక, ప్రతి ఒక్కరు తమకు అనువైన విద్యాసంస్థలలో చేరి విద్యను నిర్లక్ష్యం చేయకుండా శ్రద్దతో చదివి తల్లి తండ్రులకి గురువులకి, పుట్టిన ఊరికి, దేశానికి మంచి పేరు తేవాలి. మహిళలు చదువుకుంటే వాళ్ళ పిల్లలు, కుటుంబమంతా బాగుపడుతుంది. ఈరోజు అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలలో నాణ్యమైన ఉచితవిద్య అందిస్తున్నారు. కనుక ప్రతి ఒక్కరు ఇట్టి సదవకాశాన్ని వినియోగించుకుని ప్రతి ఒక్కరు చదువుకోవాలని అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్బంగా కోరారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రవీందర్ రెడ్డి తో పాటు విద్యార్థులు, వర్కర్స్ నరేష్, అంనేయులు పాల్గొన్నారు.