అనవసరంగా అర్ధరాత్రి వేళ బయట తిరగవద్దు ఎస్సై వెంకట్ రెడ్డి
తిరుమలగిరి 8 మార్చి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
అత్యవసరమైతే తప్ప అర్థరాత్రి వేళల్లో ప్రజలు బయటకు రావద్దని తిరుమలగిరి సబ్ ఇన్స్పెక్టర్ గుత్త వెంకటరెడ్డి ప్రజలను కోరారు. తిరుమలగిరి మండలం తొండ, నందపురం గ్రామాలలో విస్తృతంగా పర్యటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. స్టేషన్ పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి.అవాంఛనీయ ఘటనలు జరగకుండా అనుమానితులపై నిఘా ఉంచామని, భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేకుండా రాత్రివేళల్లో రోడ్ల పైన వాగులు వెంబటి తిరగవద్దని హెచ్చరించారు అలాగే తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, వారు చెడు అలవాట్లకు బానిస కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పిల్లలకు కౌన్సెలింగ్ అవసరమైతే స్థానిక పోలీస్ స్టేషన్‌ను సంప్రదించవచ్చని తెలిపారు.వ్యాపార సంస్థలు ప్రభుత్వ నిర్దేశిత సమయానికి షాపులు మూసివేసి, పోలీసులకు పూర్తి సహకారం అందించాలని ఆయన కోరారు. ప్రజల సహకారంతోనే శాంతిభద్రతలు పరిరక్షించవచ్చని స్పష్టం చేశారు.