గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి. CPM డిమాండ్

Mar 7, 2026 - 20:25
 0  0
గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి. CPM డిమాండ్
గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి. CPM డిమాండ్

జోగులాంబ గద్వాల 7మార్చి 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించి, కూలీలకు 200 రోజులు పని కల్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ.వెంకటస్వామి డిమాండ్ చేశారు. అఖిలభారత కమిటీ మేరకు  శనివారం గద్వాల మండలంలోని కొత్తపల్లి,గుంటుపల్లి గ్రామాలలో ఉపాధి కూలీలను కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సమావేశాల్లో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి, వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజుగా యోజన వి బి జి రామ్ జి అనే బిల్లును తీసుకొచ్చిందని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో మంద బలంతో, అఖిలపక్ష రాజకీయ పార్టీలతో ఏమాత్రం చర్చలు, సంప్రదింపులు లేకుండా ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి ప్రజాస్వామిక విధానాలకు పాల్పడిందని విమర్శించారు. ఉపాధి హామీ ఇకపై చట్టంగా ఉండబోదని,అది కేవలం ఒక పథకంగా మాత్రమే ఉంటుందని తెలిపారు. ఉపాధి హామీ చట్టంలో యంత్రాలను ఉపయోగించేవారు కాదని కేవలం మానవ శ్రమ మాత్రమే ఉండేదని, కానీ వీబిజిరాంజీ బిల్లులో ఉపాధిలో యంత్రాలు,యంత్ర పరికరాలను వినియోగించుకోవచ్చు అని చట్టం చేశారని, దీనివల్ల కూలీలకు పని దినాలలో కోతలు పెరుగుతాయని, ధనవంతులకు లాభాలు పెరుగుతాయని  తెలిపారు.దేశంలో గ్రామీణ కూలీల ఉపాధిని దెబ్బతీయడానికి,సంక్షేమం నుండి  తన బాధ్యతను తప్పించుకోవడానికి ప్రభుత్వం ఈ విధంగా చేసిందన్నారు.ఉపాధి హామీ పథకాన్ని  చట్ట రూపంలో కాకుండా సంక్షేమ పథక రూపంలో అమలు చేయడం వల్ల ప్రజల ఉపాధికి హామీ ఉండబోదని, నిధుల సంఖ్యను సైతం తగ్గించారని  తెలిపారు. ఉపాధి హామీకీ మూడు లక్షల కోట్లు అవసరం ఉండగా కేవలం 90 వేల కోట్లు మాత్రమే కేటాయించారని తెలిపారు.  ఒకవైపు కూలీలకు  కేటాయింపులలో కోతలు పెడుతూ మరోవైపు కూలీలకు పని దినాలు పెంచామని గొప్పలు చెబుతున్నారని విమర్శించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించి,విబిజి రామ్ జీ బిల్లు రద్దుచేసి, కూలీలకు పని దినాలను 200 రోజులకు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఉప్పేర్ నరసింహ, ఉపాధి కూలీలు రవి, అహ్మద్, చిన్న రాముడు, బతకన్న, మల్దకల్, సవారన్న, కిష్టన్న తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333