ఘనంగా బాలగోపాల్ రెడ్డి 4వ వర్ధంతి

Mar 6, 2026 - 18:52
 0  0
ఘనంగా బాలగోపాల్ రెడ్డి 4వ వర్ధంతి
ఘనంగా బాలగోపాల్ రెడ్డి 4వ వర్ధంతి

నిరంతరం కార్మికులకు అండగా ఉండి పోరాడిన నాయకుడు బాలగోపాల్ రెడ్డి.

AITUC జిల్లా అధ్యక్షులు బి ఆంజనేయులు.

 జోగులాంబ గద్వాల 6మార్చి 2026 తెలంగాణ వార్త ప్రతినిధి :  గద్వాల. ఘనంగా బాలగోపాల్ రెడ్డి 4వ వర్ధంతి ని శుక్రవారం నాడు స్థానిక నల్లకుంట లారీ హమాలీ యూనియన్ (ఏఐటీయూసీ) అడ్డ లో అయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది.

    ఈసందర్బంగా ఏ ఐ టి యు సి జిల్లా అధ్యక్షుడు బి ఆంజనేయులు కార్మికులందరితో కలిసి ఆయన యొక్క వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అనంతరం బాలగోపాల్ రెడ్డి చేసిన కృషిని కొనియాడుతూ 40 ఏళ్లుగా గద్వాల జిల్లా నడిగడ్డలో కార్మికులకు సంఘాలు పెట్టి వారి హక్కుల కోసం నిరంతరం పోరాటం సాగించారని కొనియాడారు బాలగోపాల్ రెడ్డి ఎన్నడు డబ్బు కోసం పాకులాడకుండా నిస్వార్ధంగా కార్మిక కర్షక ప్రయోజనాలతో పాటు గద్వాల అభివృద్ధి కొరకు అనేక ఉద్యమాలలో ముందుండి పోరాటం సాగించారని పేర్కొన్నారు ఇలాంటి బాలగోపాల్ రెడ్డి మరణం గద్వాల జిల్లాకు తీరని లోటని ఆయన మరణించి నాలుగేళ్లయిన ఇంకా ఆయన జ్ఞాపకాలు మన మధ్యనే ఉన్నాయని తెలిపారు ఇలాంటి వ్యక్తికి మనం ఘనమైన నివాళులు అర్పించడం మనందరి బాధ్యత అని గుర్తు చేశారు. ఆయన కలలుగన్న పోరాటం చేసిన విధానాలకు అనుగుణంగా మనమందరం పాట పడినప్పుడే ఆయనకు మనం ఘనమైన నివాళులర్పించినట్లుగా ఉంటుందని కార్మికులందరూ ఇలాంటి నిస్వార్ధ నాయకుడిని మరవరాదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో లారీ అమాలి యూనియన్ నాయకులు నారాయణ వెంకటేష్ రంగన్న కాంగ్రెస్ నాయకుడు టి డి రాజు, lic సత్యరాజు,హమాలీలు పాండు రాజు నరసింహులు వెంకట రాములు బాలగోపాల్ రెడ్డి మనుమడు అశ్విత్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333