విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు

Mar 7, 2026 - 21:04
Mar 7, 2026 - 21:04
 0  0
విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు

10 జీపీఏ సాధించే విద్యార్థులకు 10వేల నగదు బహుమతి

మహర్షి డిగ్రీ కళాశాలలో ఘనంగా ఫేర్వెల్ డే వేడుకలు 


సూర్యాపేట:- జిల్లా కేంద్రంలోని 60 ఫీట్ రోడ్డులో గల మహర్షి డిగ్రీ కళాశాల ఫేర్వెల్ డే వేడుకలను శనివారం జిల్లా కేంద్రంలోని సూర్యాపేట ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ పల్లె నగేష్, కరస్పాండెంట్ నారాయణ ప్రవీణ్ కుమార్,చైర్ పర్సన్ జిన్నె రమాదేవి మాట్లాడుతూ తాము ఎలాంటి లాభాపేక్ష లేకుండా నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించేందుకు 2023లో మహర్షి డిగ్రీ కళాశాలను తిరిగి ప్రారంభించామన్నారు. పట్టుదల, ఏకాగ్రతతో చదివితే సాధించలేనిదంటూ ఏమి లేదన్నారు.విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.సెమిస్టర్ పరీక్షలలో 10కి 10 జీపీఏను సాధించే విద్యార్థులకు రూ.10 వేలు నగదు బహుమతిని అందజేస్తామన్నారు. యూనివర్సిటీ పరిధిలో తమ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నారని చెప్పారు. విద్యార్థులు అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు విశ్రమించవద్దని అన్నారు.తాము విద్యార్థులకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333