దేశంలో ఉద్యోగం పేరుతో జరుగుతున్న

Mar 6, 2026 - 18:58
 0  0
దేశంలో ఉద్యోగం పేరుతో జరుగుతున్న

వేముల శ్రీను 06మార్చి తెలంగాణ వార్త రిపోర్టర్ : దేశంలో ఉద్యోగం పేరుతో జరుగుతున్న వేతన అసమానతలపై సామాజిక కార్యకర్త యంపల్ల పురుషోత్తం రెడ్డి ఆవేదన వ్యక్తం చేసారు. ప్రభుత్వ ఉద్యోగి, ప్రైవేట్ ఉద్యోగి, వ్యవసాయ కూలీ, జాతీయ ఉపాధి హామీ కూలీ… ఇలా పని ఒక్కటే అయినా వేతనాలు మాత్రం ఆకాశం–భూమి కి ఉన్న తేడాలా.. ఉండటం సామాజిక న్యాయానికి వ్యతిరేకమని అన్నారు  ఆయన మాట్లాడుతూ… దేశంలో పని చేసే ప్రతి మనిషికి “సమాన వేతనం – సమాన హక్కు” అనే సూత్రం అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఘాటుగా డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు లక్షల్లో జీతాలు, మరోవైపు వ్యవసాయ కూలీలకు రోజుకూలి కూడా సరిగ్గా అందని పరిస్థితి కొనసాగడం తీవ్ర అన్యాయం అని ఆయన అన్నారు.

ప్రత్యేకంగా ప్రభుత్వ వ్యవస్థలో సీ కేటగిరి ఉద్యోగులకు లక్షల్లో జీతాలు ఇవ్వడం కాకుండా, దేశంలో పని చేసే అన్ని వర్గాల ప్రజలకు — ఉద్యోగులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు, జాతీయ ఉపాధి హామీ కూలీలు — అందరికీ సమానంగా వేతనం అందేలా చట్టం చేయాలని డిమాండ్ చేశారు. అప్పుడే రాజ్యాంగం ఇచ్చిన సమానత్వ హక్కు నిజంగా అమలు అవుతుందని ఆయన స్పష్టం చేశారు.

దేశాన్ని నడిపేది కేవలం కార్యాలయాల్లో కూర్చున్నవారు మాత్రమే కాదని, పొలాల్లో చెమటోడ్చే రైతు కూలీలు, కర్మాగారాల్లో పనిచేసే కార్మికులు, గ్రామాల్లో ఉపాధి హామీ పనులు చేసే కూలీలు కూడా దేశ నిర్మాణంలో సమాన భాగస్వాములేనని ఆయన అన్నారు. అలాంటప్పుడు వేతనాల్లో ఇంత పెద్ద అసమానత కొనసాగడం అన్యాయమే కాకుండా సామాజిక అసమతౌల్యానికి కారణమవుతుందని విమర్శించారు.

ఈ సమస్యపై ప్రభుత్వం వెంటనే స్పందించి చట్టబద్ధమైన నిర్ణయం తీసుకోవలి “సమాన పని – సమాన వేతనం” అనే నినాదంతో ప్రజా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

చివరగా ఆయన మాట్లాడుతూ…
“దేశాన్ని నిర్మించే ప్రతి చేతికి సమాన గౌరవం, సమాన వేతనం దక్కాలి. అదే నిజమైన ప్రజాస్వామ్యం, అదే నిజమైన సమానత్వం” అని అన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333