ఉప్పల్ ప్రెస్ క్లబ్ పైన ఈటెల రాజేందర్ అనుచరుల వీరంగం ఖండిస్తున్నాం

Apr 3, 2024 - 15:11
 0  3
ఉప్పల్ ప్రెస్ క్లబ్ పైన ఈటెల రాజేందర్ అనుచరుల వీరంగం ఖండిస్తున్నాం

జర్నలిస్టులకు వెంటనే క్షమాపణ చెప్పాలి

జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలి

తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి

ఈనెల సోమవారం ఒకటో తారీకు హైదరాబాదులో గల ఉప్పల్ ప్రెస్ క్లబ్ లో బిజెపి నాయకుడు మాజీమంత్రి ఈటల రాజేందర్ అనుచరులు చేసిన దాడులు రాజ్యాంగ విరుద్ధమని  మీడియా ను అగౌరవ పరచడమేనని తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి అన్నారు. ఎటువంటి జీతభత్యాలు వేతనాలు లేకుండా ప్రజలకు ప్రభుత్వానికి ఉచితంగా సేవ చేసే మీడియా పైన గౌరవభావంతో ఉండాల్సిన రాజకీయ నాయకులు వారి అనుచరులు ఇలా ప్రెస్ క్లబ్ లోనే ఏకంగా దాడులకు పాల్పడడం దారుణమైన చర్య అన్నారు.తాము ఏం చేసినా అడిగే వారు లేరన్న ధైర్యంతో ఇలా చేసి ఉంటారా...? అని ప్రశ్నించారు.వెంటనే జర్నలిస్టు సమాజానికి భేషరతుగా ఈటెల రాజేందర్ అనుచరులు లేదా వారి తరుపున ఈటెల రాజేందర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టడానికి వచ్చిన దళితులపైన ఉన్న ఆగ్రహాన్ని ఈటెల రాజేందర్ అనుచరులు ప్రెస్ క్లబ్ పైన,ప్రెస్ మీట్ లో పాల్గొన్న విలేకరుల పైన  దాడులకు పాల్పడడం అమానుషమన్నారు.ప్రెస్ క్లబ్ లో ఉన్న ఫర్నిచర్ ను,లోగోలను మైకులను ధ్వంసం చేసినట్లుగా తమ దృష్టికి వచ్చిందని ఎవరైతే ఈ దాడులకు పాల్పడ్డారో వారు వెంటనే నష్టపరిహారం చెల్లించి విలేకరులకు క్షమాపణ చెప్పితీరాలని యాదగిరి డిమాండ్ చేశారు.రాజకీయంలో మంచి పేరు సంపాదించుకున్న ఈటెల రాజేందర్ ఇలా చేయడం అనేది సరైనది కాదన్నారు.సమాజంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని విలేకరుల పట్ల ఏ విధంగా నడుచుకోవాలో తెలియని అనుచరులను ఈటల రాజేందర్ ఎలా దగ్గరకు రాణిస్తున్నారో...? అని ప్రశ్నించారు.ఇలాంటి వారితో రాజేందర్ కు చెడ్డ పేరు వస్తుంది, రాజకీయ జీవితానికి దెబ్బ తగిలే ప్రమాదం ఉంటుందని సంగతి రాజేందర్ గుర్తుపెట్టుకుంటే మంచిదని అన్నారు.మీడియాతో పెట్టుకుని బతికి బట్ట కట్టిన వారు ఎవరూ లేరని అన్నారు.ఏది ఏమైనా జర్నలిస్టులకు క్షమాపణ చెప్పి మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని దాడులకు పాల్పడిన వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ తరపున డిమాండ్ చేస్తున్నట్లు యాదగిరి తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ధూపాటి శ్యాంబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ గౌసుద్దీన్,రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ దుర్గం బాలు,ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షుడు చిలుకల చిరంజీవి, సూర్యాపేట పట్టణ కమిటీ సభ్యులు దేశ గాని వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333