మాదిగలకు న్యాయం జరగాలంటే 11 శాతం రిజర్వేషన్ కల్పించాలి

మద్దిరాల15 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద కొనసాగుతున్న నిరసన దీక్షలు ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాతే గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఫలితాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మండల ఇన్చార్జి కొడిశాల లింగయ్య ఆధ్వర్యంలో శనివారం 5వ రోజు కొనసాగుతున్న నిరసన దీక్షలు ఈ దీక్షకు వల్లపు రవి యాదవ్ ముఖ్యఅతిథిగా పాల్గొని దీక్షను ప్రారంభించారు తుంగతుర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ పాల్వాయి బాలయ్య మాట్లాడుతూ..ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేసిన తర్వాత నే తెలంగాణలో గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఉద్యోగ ఫలితాలను మరియు నియామకాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మద్దిరాల మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఎమ్మార్పీఎస్ నిరసన దీక్ష కార్యక్రమాలు చేపట్టడం జరిగినది ఈ నిరసన దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించడం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేస్తామని చెబుతూనే మరొకవైపు ఎస్సీ వర్గీకరణ జరగకుండా గ్రూప్ 1 గ్రూప్-2 గ్రూప్ 3 ఉద్యోగ ఫలితాలను ఉద్యోగ నియామకాలను విడుదల చేస్తూ మాదిగ మాదిగ ఉపకులాలకు తీరని అన్యాయం చేస్తున్నాడని తెలిపారు స్వార్ధపర వర్గీకరణ వ్యతిరేక శక్తులకు రాష్ట్ర ప్రభుత్వం తలవగ్గి వర్గీకరణ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు.దానికి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగల చేతుల్లో తగిన రాజకీయ మూల్యం చెల్లించుకోక తప్పదని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నే వర్గీకరణ ప్రక్రియను శాస్త్రీయంగా న్యాయబద్ధంగా అన్ని ఉపకులాలకు సామాజిక న్యాయం జరిగే విధంగా వేగవంతం చేయాలని అన్నారు. అప్పటివరకు ఎలాంటి ఉద్యోగ ఉద్యోగ నియామకాలు చేపట్ట రాదని డిమాండ్ చేశారు.ఈ దీక్ష కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు రాంపాక సత్తయ్య మాదిగ,రాంపాక వెంకన్న,వల్లపు రవి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.