కామ్రేడ్ బొమ్మగాని ధర్మ బిక్షం గారి జయంతి జయప్రదం చేయండి
సిపిఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు
సూర్యాపేట:- స్వతంత్ర సమరయోధులు, తెలంగాణ సాయుధ పోరాట యోధులు, మాజీ ఎంపీ మాజీ శాసనసభ్యులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గీత పని వారాల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తిశేషులు కామ్రేడ్ బొమ్మగాని ధర్మభిక్షం గారి 102వ జయంతిని జయప్రదం చేయాలని సిపిఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ధర్మ బిక్షం భవనంలో జరిగిన ముఖ్యల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ ధర్మ బిక్షం విద్యార్థి దశలోనే చదువుతూ సూర్యాపేట పట్టణంలో విద్యార్థులకు వసతి గృహాలు ఏర్పాటు చేసి హాస్టల్లో విద్యాబుద్ధులు నేర్పించి వీర యోధులను తెలంగాణ సాయుధ సమరంలో సన్నిధం చేసిన మహనీయుడు అన్నారు. బాల్యం, యవ్వనం అంతా ప్రజా పక్షాన పోరాటం చేసిన ఘనత అయినదని కొనియాడారు. ఆనాడు పట్టణంలో అనేక పోరాటాలు నిర్వహించి కార్మికుల, కర్షకుల హక్కులను సాధించుకొని ప్రజాసంఘాల నిర్మించిన ఉద్యమ నేత అని అన్నారు. చట్టసభల్లో తాడిత పీడిత ప్రజానిక సమస్యలను అదేవిధంగా నీటి ప్రాజెక్టులను రైల్వే లైన్ గురించి పోరాడిన మహానేత కామ్రేడ్ ధర్మబిక్షం అన్నారు.ఈ సందర్భంగా ఫిబ్రవరి 15న అనగా నేడు 102 వ జయంతిని ధర్మబిక్షం చౌక్ ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజ్ ఆయన విగ్రహం దగ్గర ఉదయం 10:30 కి ఘనంగా నిర్వహించటం జరుగుతుంది కావున కార్మికులు కర్షకులు శ్రేయోభిలాషులు మేధావులు యువజనలు విద్యార్థులు వివిధ పార్టీ శ్రేణులు సానుభూతిపరులు తప్పకుండా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరారు. తెలంగాణ గీత పనివారాల సంఘం రాష్ట్ర కార్యదర్శి బొమ్మగాని శ్రీనివాస్, తెలంగాణ గీత పనివారాల సంఘం జిల్లా అధ్యక్షులు రేగటి లింగయ్య నాయకులు ఐత రాజు లింగయ్య, రేగటి వెంకటేశ్వర్లు, పొదిల వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు