గద్దర్ స్ఫూర్తి పురస్కారాన్ని అందుకున్న డాక్టర్ కల్లేపల్లి నరేష్
తెలంగాణ వార్త సూర్యపేట 30-01-26:
ప్రజా యుద్ధనౌక,విప్లవకవి గద్దర్ జయంతిని పురస్కరించుకొని నాoపల్లి కేంద్రంలోని తెలుగు విశ్వవిద్యాలయం
నందమూరి తారకరామారావు కళామందిరంలో గురువారం రాత్రి ఫాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్, ఇండో కెనెడి యన్ యూత్ కౌన్సిల్,పుడమి సాహితి వేదిక సంస్థల సంయుక్త నిర్వహణలో అద్దంకి రాజా యోనా ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాయుద్ధ నౌక గద్దర్ జయంతి వేడుకలలో మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలచారి డా, జీవి వెన్నెల గద్దర్ చేతుల మీదుగా సూర్యాపేట కు చెందిన తెలంగాణ దళిత విద్యార్థి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, రాఘవేంద్ర డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రొప్రైటర్, ఐఎన్టియుసి ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కల్లేపల్లి నరేష్ గద్దర్ స్ఫూర్తి పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్బంగా నరేష్ మాట్లాడుతూ సాంస్కృతిక సామాజిక సాహిత్య కేదారంలో సమాజాన్ని జాగృతం చేసి ఉన్నత శిఖరాలను అధిరోహించిన ప్రజాయుద్ధ నౌక, జానపద వాగ్గేయకారుడు, విప్లవ కవి గద్దర్ అన్న యాధిలో జాతీయ స్ఫూర్తి పురస్కార జ్ఞాపక, ప్రశంశ పత్రం అందుకోవడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాటలతో కీలక పాత్ర పోషించిన గద్దర్ తెలంగాణ గుండె చప్పుడు అని కొనియాడారు. పుడమి సాహితి వేదిక చైర్మన్ చిలుముల బాల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వేణుగోపాల చారి, పురస్కారాల ప్రధాత, గద్దర్ కుమార్తె డాక్టర్ జి వి వెన్నెల గద్దర్, ఇండో కెనెడియన్ యూత్ కౌన్సిల్ వ్యవస్థాపకులు రొయ్యూరు శేష సాయి, టిటిడి బోర్డు పూర్వ సభ్యులు ధరావత్ బాల్ సన్ నాయక్, పారిశ్రామిక వేత్త డాక్టర్ యామినేని ఉప్పల్ రావు, సామాజికవేత్త గొల్లమందల దానయ్య తదితరులు పాల్గొన్నారు.