శిక్షణ పూర్తి చేసుకొని గద్వాల జిల్లాకు చేరిన పోలీస్ జాగిలం ఆర్య

Feb 20, 2026 - 19:25
 0  2
శిక్షణ పూర్తి చేసుకొని గద్వాల జిల్లాకు చేరిన పోలీస్ జాగిలం ఆర్య
శిక్షణ పూర్తి చేసుకొని గద్వాల జిల్లాకు చేరిన పోలీస్ జాగిలం ఆర్య

 జోగుళాంబ గద్వాల 20 ఫిబ్రవరి 2026 తెలంగాణ వార్త ప్రతినిధి :  గద్వాల్.*జిల్లాకు కేటాయించబడిన పోలీస్ జాగిలం *ఆర్య తో, డాగ్ హ్యాండిలర్ భీమేష్, ఎ.ఆర్.పిసి - 2929, డాగ్ స్క్వాడ్ ఇన్చార్జి రవికుమార్,  ఎ.ఆర్.పిసి - 2721,  ఆర్.ఐ. లు  నరేష్,  వెంకటేష్ లు మర్యాదపూర్వకంగా జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాసరావు, ఐపిఎస్., ని కలవడం జరిగినది.
 
ఐఐటిఏ మొయినాబాద్ నందు ఎనిమిది నెలల బేసిక్ ట్రైనింగ్ ను పూర్తి చేసుకున్న ఆర్య జోగుళాంబ గద్వాల జిల్లాకు కేటాయించినట్లు, ఆర్య  ప్రేలుడు పదార్థాలు కనుగొనడంలో ప్రత్యేకంగా శిక్షణ పొందినట్లు  ఆర్.ఐ.  నరేష్ ఎస్పీ కి తెలిపారు.అనంతరం పోలీస్ జాగిలానికి హ్యాండిలర్  గా వ్యవహరిస్తున్న ఎ.ఆర్ కానిస్టేబుల్ భీమేష్ ఆర్డర్ ప్రకారం పోలీస్ జాగిలం ఆర్య, జిల్లా ఎస్పీ కి రిపోర్ట్ చేయడం జరిగింది. 

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ... ప్రస్తుతం జిల్లాకు కేటాయించబడిన  ఎక్స్ ప్లోసివ్ డిటెక్టర్  జాగిలం ఆర్య తో పాటు ఒక  నార్కోటిక్ జాగిలం జిమ్మీ  మరియు రెండు ట్రాకర్స్ చార్లీ, హనీ జాగిలాలు ఉన్నట్లు తెలిపారు.  జాగిలాలకు వసతి ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, కాలానుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సంరక్షించాలని   డాగ్ హ్యాండిలర్, డాగ్ స్క్వాడ్ ఇన్చార్జి లకు  తెలిపారు. అలాగే నూతనంగా చేరిన ఎక్స్ ప్లోసివ్ డిటెక్టర్ ఆర్యతో జోగులాంబ గద్వాల జిల్లా పోలీస్ విభాగం మరింత అప్రమత్తంగా సమర్థవంతంగా సేవలందించేందుకు సిద్ధంగా ఉందని జిల్లా ఎస్పీ తెలిపారు. 

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాసరావు, ఐపిఎస్., తో పాటు అదనపు ఎస్పీ కె. శంకర్ , రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు నరేష్, వెంకటేష్ , స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ నాగేశ్వర్ రెడ్డి , డాగ్ హ్యాండ్లర్ భీమేష్, డాగ్ స్క్వాడ్ ఇన్‌చార్జి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333