రామాపురం గ్రామంలో వానదేవుని కోసం పూజలు

Aug 5, 2025 - 19:18
 0  21
రామాపురం గ్రామంలో వానదేవుని కోసం పూజలు

జోగులాంబ గద్వాల 5 ఆగస్టు 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : వడ్డేపల్లి. మండలం రామాపురం గ్రామంలో నిన్నటి రోజు గ్రామస్తులు వరుణ దేవుడి కోసం పూజలు నిర్వహించారు. 
ప్రసిద్ధ ఆంజనేయ స్వామి క్షేత్రమైన బీచుపల్లి సమీపంలో గల కృష్ణానది నుంచి కాడెద్దులతో నదీ జలాలు తీసుకొని వచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మేళ తాళాలతో భాజా భజంత్రీలతో వారికి స్వాగతం పలికారు. అనంతరం ఆ నదీ జలాలను ఉభయ రామ లింగేశ్వర ఆలయంలో గల శివలింగాలకు సమృద్ధిగా వర్షాలు కురవాలని పాడిపంటలతో వెలసిల్లాలని ప్రార్థిస్తూ అభిషేకం చేశారు .

ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333