ఇంకెన్నాళ్లు రోడ్ల కష్టాలు..

ఇబ్బందులు పడుతున్న వాహనదారులు

Sep 23, 2025 - 20:44
Sep 23, 2025 - 20:46
 0  14
ఇంకెన్నాళ్లు రోడ్ల కష్టాలు..

*ఇంకెన్నాళ్లు రోడ్ల కష్టాలు..ఇబ్బందులు పడుతున్న వాహనదారులు* అడ్డగూడూరు 22 సెప్టెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– 

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పదవిలోని బొడ్డుగూడెం గ్రామం వద్ద హైవే కోసం టోల్గేట్ పను నిర్మిస్తున్నారు.అందులో భాగంగా నిర్మిస్తున్న స్థలం నుండి రోడ్డు సైడ్ వేయడం జరిగింది. వర్షాకాలం కావడంతో రోడ్డంతా బురద,లోతు లోతు గుంటల మయమై వాహనాలు దిగబడుతున్నాయి. దానిని గమనించి కాంట్రాక్టర్,లేదా ఆర్ అండ్ బి అధికారులు పట్టించుకోని మొరం పోసి చదును చేసి వచ్చిపోయే వాహనాలకు ఇబ్బందులు కలవకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది. గత మూడు నెలల నుండి అలా చేయకపోవడం వల్ల వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ బురద వల్ల రాకపోకలు నిలిచిపోయి కార్లు,బైకుల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.సంబంధిత అధికారులు స్పందించి అదనపు మట్టి కోసి రోడ్డును సదును చేయాలని ప్రయాణికులు, టు వీలర్,త్రీ వీలర్ వాహనదారులు కోరుతున్నారు.