ప్రపంచ కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన జడ్పిటిసి కేశిరెడ్డి వెంకట రమణమ్మ చిన్నారెడ్డి

01-05-2024 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం. ఉపాధి హామీ పనిని సందర్శించి పరిశీలించిన చిన్నంబావి మండల జడ్పిటిసి వెంకట్రామమ్మ, చిన్నారెడ్డి.
చిన్నంబాయి మండల కేంద్రము సమీపంలో జరుగుతున్న ఉపాధి హామీ పనిచేసే కూలీలను సందర్శించి ప్రపంచ కార్మికుల దినోత్సవ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఉపాధి హామీ పథకంలో పని చేసే కూలీలు వాతావరణంలో తీవ్ర వేడి ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఓఆర్ఎస్ గాని మజ్జిగ గాని నీటిని గాని ఎక్కువగా సేవించి వడదెబ్బ నుంచి కాపాడుకోవాలని ఈ సందర్భంగా జడ్పిటిసి గారు తెలిపారు అందుకు సంబంధించిన ఏర్పాట్లను ఉపాధి హామీ అధికారులు ఏర్పాటు చేయాలన్నారు
ఉపాధి హామీ కూలీలు జడ్పిటిసి గారితో మాట్లాడుతూ తమకు చేసిన పనికి సరైన కూలీలు రావడంలేదని గత వారంలో 120 రూపాయలు మాత్రమే రోజు చొప్పున పడ్డాయని ఉపాధి హామీ పనికి రాని వారి పేర్లు కూడా మష్టర్లొ చేరుస్తున్నారని ఈ సందర్భంగా జడ్పిటిసి గారికి కొందరు తెలియజేయడం జరిగినది ఇట్టి విషయంపై వెంటనే అధికారులతో మాట్లాడి ఉపాధి హామీ కూలీలకు సరైన న్యాయం జరగాలని వారికి వచ్చే వేతనాలు సక్రమంగా పనికి తగ్గ వేతనాన్ని ఇచ్చి వారికి కూలి పడే విధంగా చేయాలని ఎలాంటి అవినీతి జరుగొద్దని జడ్పిటిసి గారు అధికారులను కోరారు