మార్ముల గ్రామంలో దాగి ఉన్న ఆణిముత్యం వకీల్ సాబ్

23-09-2025 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం.
చిన్నంబావి మండలం మారుమూల ప్రాంతమైన గూడెం గ్రామంలో మట్టిలో దాగి ఉన్న ఆణిముత్యం మక్బూల్ పాషా (వకిల్ సాబ్)
గ్రామం మారుమూల గ్రామం, కుటుంబం పేదింటి కుటుంబం అయినా ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా, కుటుంబం భారం మీద పడ్డ, ఎక్కడ అవాంతరాయాలకు గురికాకుండా చదివే లక్ష్యంగా పెట్టుకుని పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చు అని నిరూపించాడు.
చదువులో మాధుర్యం - చదివే చిన్నారులకు ఏదో ఒక రూపకంగా ఆదుకునే గుణం కలవాడు, ఆటలలో ఆదర్శంగా నిలిచేవాడు
ఉన్నత చదువుల్లో భాగంగా LLB పూర్తి చేసుకొని LLM కొనసాగించేందుకు ముందుకు వెల్తూ గ్రామానికే ఆదర్శంగా నిలుస్తున్న *"మక్బూల్ పాషా (వకీల్ సాహెబ్ ) కు గ్రామస్తులు, విద్యార్థినీ విద్యార్థులు, గ్రామ రాజకీయ నాయకులుహార్దిక శుభాకాంక్షలు, తెలియజేశారు.