బార్ అసోసియేషన్ ఎన్నికల్లో సామాజిక న్యాయం గెలిచింది
నా గెలుపుకు సహకరించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి ధన్యవాదాలు
మహనీయుల విగ్రహాలకు నివాళులర్పించిన బార్ నూతన అధ్యక్షులు కొంపెల్లి లింగయ్య
సూర్యాపేట, 30 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- హోరాహోరీగా సాగిన సూర్యాపేట బార్ అసోసియేషన్ ఎన్నికల్లో సామాజిక న్యాయం గెలిచిందని సూర్యాపేట బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొంపెల్లి లింగయ్య అన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన ఆయన సీనియర్ న్యాయవాదులతో కలసి ఆదివారం పట్టణంలోని మహనీయులు జ్యోతిరావు పూలే, మాత్మ గాంధీ, బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో ఆయా పదవులకు అన్ని వర్గాలకు చెందిన అభ్యర్థులు విజేతలుగా నిలిచారని దీంతో సామాజిక న్యాయం గెలిచిందన్నారు. బడుగు బలహీన వర్గానికి చెందిన తనను ఆదరించి అధ్యక్షుడిగా గెలిపించిన న్యాయవాదులకు ధన్యవాదాలు తెలిపారు. మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి తమ గెలుపులో ప్రధాన భూమిక పోషించారన్నారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో కోర్టుకు 8 ఎకరాల స్థలాన్ని అందించడమే కాకుండా కోర్టులో వివిధ అభివృద్ధి పనులకు సహకరించడం తమ ఎన్నికకు ఎంతో ఉపకరించిందన్నారు. న్యాయవాదిగా న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని వారి సమస్యల పరిష్కారానికి సీనియర్ న్యాయవాదుల సహకారంతో శాయ శక్తుల కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు నల్లగుంట్ల అయోధ్య,, గొండ్రాల అశోక్, తల్లమల్ల హసేన్, జె.సి మౌళి, మీసాల శ్రీనివాస్, అనుములపురి సైదులు తదితరులు ఉన్నారు.