పత్తి పంటను పరిశీలన చేసిన అధికారులు

Aug 24, 2024 - 20:57
Aug 24, 2024 - 21:36
 0  3
పత్తి పంటను పరిశీలన చేసిన అధికారులు

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ గ్రామీణ స్థితిగతులను అధ్యయనం చేసిన వ్యవసాయ విద్యార్థులు లేదా పత్తి పంటను పరిశీలన చేసిన అధికారులు గ్రామీణ కృషి అనుభవ కార్యక్రమంలో భాగంగా లయోలా అకాడమీ సికింద్రాబాద్ చెందిన బి యస్సి వ్యవసాయ డిగ్రీ కోర్సు విద్యార్థులు గ్రామీణ వ్యవసాయ విధానాలు స్థితిగతులను తెలుసుకొని PRA కార్యక్రమం ద్వారా అధ్యయనం చేసినట్లు కె.వి.కె- గడ్డిపల్లి ప్రోగ్రాం అసిస్టెంట్ ఆకుల నరేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారిని డి. దివ్య తుమ్మల పెంపహాడ్ నందుగల రైతు వేదికలో గ్రామీణ అవగాహన సదస్సు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ విద్యార్థులు గ్రామస్తులతో సంభాషించి వారు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి తెలుసుకొని వాటి పరిష్కార మార్గాలను గ్రామ పటం, వెన్ డయాగ్రమ్,పై చార్ట్,చిత్రాల రూపంలో ప్రదర్శించి గ్రామీణ రైతులకు అవగాహన కల్పించినట్లు తెలియజేసారు. తదనంతరం శాస్త్రవేత్తలు రైతులతో కలిసి పత్తి పంట పరిశీలన చేసి పత్తిలో ఆశించే రసం పీల్చే పురుగుల నివారణ గురించి మరియు గులాబీ రంగు పురుగులను ఏ విధంగా అంచనా వేయాలి, లింగాకర్షక బుట్టలు ఎలా అమర్చుకోవాలి మరియు గులాబి రంగు పురుగు నివారణ గురించి రైతులకు వివరించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి దివ్య మాట్లాడుతూ శాస్త్రవేత్తల సలహాలు సూచనలు పాటించి రైతులు అధిక దిగుబడి పొందాలని సూచించారు ఈ కార్యక్రమంలో బి వెంకన్న, ఎస్కే మౌలానా, పిచ్చయ్య, దేవేందర్, ఎస్ వెంకన్న, బి మల్లయ్య, పి వెంకటయ్య, లింగయ్య, బిక్షం, వ్యవసాయ విద్యార్థులు వివేక్, వీర రాఘవ, ఉమేష్, భాను తేజ, రాజారావు, తేజ, దీపక్ పాల్గొన్నారు ఫోటో : గ్రామ పటం ద్వారా అవగాహనా కలిపిస్తున్న వ్యవసాయ డిగ్రీ విద్యార్థినిలు మరియు కె.వి.కె శాస్త్రవేత్తలు.