జడ్జి కొంపముంచిన అగ్నిప్రమాదం!

Mar 21, 2025 - 19:39
 0  1
జడ్జి కొంపముంచిన అగ్నిప్రమాదం!

 ఇళ్లంతా నోట్ల కట్టలే.. ఫైర్‌ సిబ్బంది షాక్‌! అంతా బ్లాక్‌ మనీ..

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నిమాపక దళం భారీ మొత్తంలో నగదును కనుగొంది. ఈ ఘటన తరువాత, ఆయనను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. అక్రమార్జన ఆరోపణలపై దర్యాప్తు జరుగుతోంది, అభిశంసన ప్రక్రియ కూడా పరిశీలనలో ఉంది. న్యాయవ్యవస్థ ప్రతిష్టను కాపాడటానికి ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని కొలీజియం కోరింది.

ఓ న్యాయమూర్తి ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. వెంటనే కుటుంబ సభ్యులు ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించారు. మంటలు ఆర్పేందుకు వచ్చిన ఫైర్‌ సిబ్బందికి కళ్లు బైర్లు కమ్మేలా ఇళ్లంతా నోట్ల కట్టలే కనిపించాయి. అది చూసి వాళ్లు షాక్‌ అయ్యారు. అదంతా ప్రభుత్వానికి లెక్క చూపని డబ్బుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంతకీ ఇళ్లంతా నోట్ల కట్టలతో నింపేసిన ఆ న్యాయమూర్తి ఎవరంటే.. ఢిల్లీ హైకోర్ట్‌ న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ. జస్టిస్ వర్మ నగరంలో లేని సమయంలో ఆయన అధికారిక నివాసంలో మంటలు చెలరేగాయి. దీంతో ఆయన కుటుంబ సభ్యులు అగ్నిమాపక సిబ్బందికి తెలియజేశారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333