సివిల్ ఫిర్యాదులను కోర్టులోనే పరిష్కరించుకోవలి:జిల్లా ఎస్పీ

Apr 1, 2024 - 19:16
 0  9
సివిల్ ఫిర్యాదులను కోర్టులోనే పరిష్కరించుకోవలి:జిల్లా ఎస్పీ

జోగులాంబ గద్వాల 1 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- ప్రజావాణి (ప్రజా ఫిర్యాదుల స్వీకరణ దినం) సందర్భంగా జిల్లా లో  వివిధ ప్రాంతాల నుండి జిల్లా పోలీస్ కార్యాలయానికి 6 ఫిర్యాదులు రావడం జరిగింది. పిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను స్వయంగా  విన్న  జిల్లా ఎస్పీ రితిరాజ్  వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా ఆయా   సర్కిల్ ఇన్స్పెక్టర్ లకు, ఎస్సై లకు ఆదేశించడం అయినది. అలాగే సివిల్ ఫిర్యాదులను కోర్టులోనే పరిష్కరించుకోవలసిందిగా వారికి సూచించడమైనది. మరియు ప్రజలు తీసుకు వచ్చిన ఫిర్యాదులపై చట్టప్రకారం తక్షణ చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేకూర్చే ఏ ఫిర్యాదులు పెండింగ్ లేకుండా చూడాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు.   ప్రజలు అత్యవసర సమయంలో డయల్- 100 కి కాల్ చేసి పోలీసువారికి సమాచారం ఇవ్వాలని సూచించారు.సోమవారం వచ్చిన పిర్యాదులు సపోట పండ్ల తోటకు నిప్పు అంటించిన అంశంకు సంబందించి -01 పిర్యాదు.గొడవలకు సంబందించి -01 పిర్యాదులు.రోడ్డు ప్రమాదానికి సంబందించి -0 1పిర్యాదు.ఇతర అంశాలకు సంబంధించి -03 పిర్యాదులు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333