ఆశాలకు ప్రమోషన్లు ఇవ్వాలి.CITU
జోగులాంబ గద్వాల 10 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల ఆశ వర్కర్ల సమస్యలపై కమిషనరేట్ ను ముట్టడించిన సందర్భంగా ప్రభుత్వము, అధికార యంత్రాంగం ఇచ్చిన హామీ మేరకు అర్హులైన ఆశ వర్కర్లు అందరికీ ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని తెలంగాణ వాలంటరీ & కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయు అనుబంధం) జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పద్మ, సునీత డిమాండ్ చేశారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని స్థానిక వాల్మీకి కమిటీ హాల్లో జరిగిన గద్వాల,ఉప్పేర్ PHC ల మహాసభలకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దశాబ్దాల తరబడి గ్రామీణ,పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు విశేషమైన సేవలు అందిస్తున్నప్పటికీ ప్రమోషన్ల విషయంలో అన్యాయానికి గురి అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికే విధి నిర్వహణలో ఎంతో మంది ఆశ వర్కర్లు, ఎటువంటి ప్రమోషన్లు అందుకోలేక మధ్యలోనే మరణించారని వారి కుటుంబ సభ్యులకు ఎటువంటి సహకారం అందడం లేదన్నారు.కమిషనర్ ముట్టడి సందర్బంగా ఏఎన్ఎం ట్రైనింగ్ పూర్తి చేసిన ఆశలకు ఏఎన్ఎం పోస్టుల్లో ప్రమోషన్ సౌకర్యం కల్పిస్తామని, వెయిటేజ్ మార్కులు నిర్ణయిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. కానీ ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయకపోగా అదనపు పని భారాలతో ఇబ్బందులకు గురి చేస్తున్నదని విమర్శించారు.సంవత్సరాల పాటు సేవలు చేసిన ఎటువంటి ప్రమోషన్లు లేక ఆశలు పదవి విరమణ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.తక్షణమే అర్హులైన ఆశలకు ఏఎన్ఎం లుగా ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని, ఇచ్చిన హామీ ప్రకారం ఆశలకు ఇన్సూరెన్స్ 50 లక్షలు చెల్లిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని మట్టి ఖర్చులకు 50 వేల రూపాయలు చెల్లించాలని, ఖాళీగా ఉన్న ఆశ వర్కర్ల పోస్టులో భర్తీ చేయాలని పారితోషికం లేని పనులు చేయించరాదని డిమాండ్ చేశారు.అనంతరం ఉప్పేరు గద్వాల PHC ల వారిగా నూతన కమిటీలను ఎన్నుకున్నారు. ఉప్పేర్ PHC అధ్యక్ష కార్యదర్శులుగా నర్సింగమ్మ, పద్మ, ఉపాధ్యక్షులుగా అభేద, వరలక్ష్మి, సహాయ కార్యదర్శులుగా కల్పన,కవిత, కోశాధికారిగా లక్ష్మి, కమిటీ సభ్యులుగా రాధా, సుజాత, పావని, సాయమ్మ, గోవిందమ్మ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు తెలిపారు.
గద్వాల PHC అధ్యక్ష కార్యదర్శులుగా శ్రీదేవి, పద్మ, ఉపాధ్యక్షులుగా శ్వేత, సునీత, సహాయ కార్యదర్శులుగా లక్ష్మీ, జయలక్ష్మి, కోశాధికారిగా రమాబాయి, కమిటీ సభ్యులుగా కే లక్ష్మి, కవిత, నాగ ప్రమీల, జయమ్మ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయు జిల్లా కార్యదర్శి వివి నరసింహ, జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్పేర్ నరసింహ పాల్గొన్నారు.