తిరుమలగిరిలో నిరసన వ్యక్తం చేసిన బీసీ సంఘం నాయకులు

Oct 10, 2025 - 21:48
 0  165
తిరుమలగిరిలో నిరసన వ్యక్తం చేసిన బీసీ సంఘం నాయకులు

తిరుమలగిరి 11 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్

బీసీ రిజర్వేషన్ల పై హైకోర్టు విధించిన స్టే ను నిరసిస్తూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీను పిలుపుమేరకు తిరుమలగిరి మండల కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, B.C కుల సంఘాల ఆధ్వర్యంలో పూలే_అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలోని మాజీ ప్రజా ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, బీసీ నాయకులు, మరియు సామాజిక ఉద్యమ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్ల బిల్లు అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ బిల్లును అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపి, అ బిల్లును గవర్నర్ పంపి రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో చేర్చి రిజర్వేషన్లు అమలు అయ్యే విధంగా చూడాలని ఆ బిల్లును కేంద్రానికి పంపితే, కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లుపై పార్లమెంటులో చర్చించకుండా, నిర్లక్ష్యం చేయడం జరిగిందనిఅన్నారు. ఆ బిల్లును నిర్లక్ష్యం చేయవద్దు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పై ఎంతో ఒత్తిడి తెచ్చి న ఏ మాత్రం కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువచ్చి గవర్నర్ కు పంపడం జరిగిందన్నారు. మళ్లీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేటి తీర్మానం చేసి ఆర్డినెన్స్ తీసుకొని వస్తే ఆర్డినెన్స్ కూడా పక్కకు పెట్టడం జరిగిందని, మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్లపై జీవో నెంబర్ 9 ని తీసుకుని వస్తే గవర్నర్ ఆ జీవోను కూడా పక్కకు పెట్టడం జరిగిందని అన్నారు. స్థానిక సంస్థల 42 శాతం రిజర్వేషన్ల జీవో 9ను రద్దు చేయాలని కోరుతూ రెడ్డి జాగృతి నాయకులు హైకోర్టులో పిటిషన్ వేయడంతో 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడం జరిగిందని, ఈ స్టే బీసీ వ్యతిరేక చర్యగా భావించాలని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం జనాభా లెక్కల్లో కులాల వారిగా సేకరించి బీసీల యొక్క జనాభా 56.33% తేలిన చట్టబద్ధంగా కులగణన జరిగిన గాని, బీసీ రిజర్వేషన్ వ్యతిరేకులు న్యాయస్థానాల్లో పిటిషన్ వేయడం ఇది సరైన పద్ధతి కాదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఓసి జనాభా ఎనిమిది శాతం ఉన్న ఈడబ్ల్యూఎస్ 10% అమలుపరచడం జరుగుతుందని E.W.S విషయంలో బీసీలు ఏ రోజు కూడా కోర్టులో పిటిషన్ వేయలేదని, బీసీల రిజర్వేషన్ల వచ్చేసరికి అగ్రవర్ణాలకు చెందినటువంటి, కొందరు కోర్టులో పిటిషన్ వేయడం మంచి పద్ధతి కాదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 42 శాతం రిజర్వేషన్లు అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీ అన్ని రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను, బీసీ కుల సంఘాలతో అఖిలపక్షాలను ఏర్పాటు చేయాలని, ఆ జీవో అమలు కావాలంటే రాష్ట్రంలో ఉన్నటువంటి బిజెపి పార్టీ ప్రజా ప్రతినిధులు రాష్ట్ర అధ్యక్షులు గవర్నర్ దగ్గర వెళ్లి బిల్లుపై చర్చించి బిల్లు ఆమోదం అయ్యే విధంగా చూడాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో బిజెపికి బీసీల ఓట్లు కావాలంటే బీసీల బిల్లుకు అసెంబ్లీలో మద్దతు తెలపడం కాదు బయట కూడా మద్దతు తెలిపితే మీ పార్టీకి తెలంగాణలో తిరిగే అవకాశం ఉంటదని అదే విధంగా రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ కూడా బీసీల పక్షాన పోరాడాలని లేకపోతే మీ రాజకీయ పార్టీలకు శంకరగిరి మాన్యాలు పట్టిస్తారని అన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో అన్ని రాజకీయ పార్టీలు డ్రామాలాడుతున్నాయని ఒక పార్టీపై ఇంకొక పార్టీ నెట్టు వేసుకుంటూ బీసీలను బలి పశువులు చేస్తున్నారని అన్నారు. ఇప్పుడు చేస్తున్న నిరసన ఆరంభం మాత్రమే భవిష్యత్తులో బడుగు బలహీన వర్గాలను ఐక్యం చేసుకుంటూ పెద్ద ఎత్తున ఉద్యమం చేసి 42 శాతం రిజర్వేషన్లు అమలు అయ్యేదాకా పార్టీలను, జెండాలను, పక్కకు పెట్టి పోరాడుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు ఎల్సోజు నరేష్, మాజీ ఎంపీపీ, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కోమ్మినేని సతీష్ కుమార్, సామాజిక తెలంగాణ మహాసభ రాష్ట్ర కన్వీనర్ కొత్తగట్టు మల్లయ్య, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తన్నీరు రామ్ ప్రభు,మాజీ కౌన్సిలర్లు ఒత్తుల శ్రీనివాస్, గిలకత్తుల రాము గౌడ్, చిర్రబోయిన హనుమంతు యాదవ్, సామాజిక ఉద్యమ నాయకులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కందుకూరి ప్రవీణ్, పనిగిరి మాజీ సర్పంచ్ గట్టు నరసింహారావు, సిపిఐ పార్టీ నియోజవర్గ ఇన్చార్జి ఎల్లంల యాదగిరి, కాంగ్రెస్ పార్టీ నాయకులు వంగాల దానయ్య, సామాజిక ఉద్యమకారుల పత్తేపురం యాదగిరి, పద్మశాలి సంఘం మండల ప్రధాన కార్యదర్శి చింతకింది సోమనారాయణ, తిరుమలగిరి పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షులు చింతకింది మురళి, తిరుమలగిరి మండల రజక సంఘం అధ్యక్షులు పులిమామిడి సోమన్న, పులిమామిడి బిక్షం, పులిమాటి వెంకన్న, జై భారత్ బీసీ సంఘం అధ్యక్షులు దుస్సారాం మూర్తి, ముదిరాజ్ సంఘం నాయకులు చింతకాయల సుధాకర్, సూర్యాపేట జిల్లా కార్యదర్శి వంగరి బ్రహ్మం, బీసీ సంక్షేమ సంఘం తిరుమలగిరి అధ్యక్షుడు పట్టణ అధ్యక్షులు, ముద్దంగుల యాదగిరి, కళాకారులు బూరుగుల ప్రభాకర్, మేరు సంఘం నాయకులు గూడూరు వెంకన్న, యాదగిరి,శ్యామల రమేష్, వెంకన్న, కడెం మల్లయ్య, చిలకల లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి