ఆలూరు గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం

Sep 25, 2025 - 18:59
 0  9
ఆలూరు గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం
ఆలూరు గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం

-రోడ్డుపై చెత్త సేకరించని పంచాయితీ కార్మికులు.

-పట్టించుకోని పాలకులు అధికారులు.

- గ్రామ సమస్యలపై త్వరలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తాం.

- నడిగడ్డ హక్కుల పోరాట సమితి నాయకులు.

 జోగులాంబ గద్వాల 25 సెప్టెంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి :  గట్టు. మండలంలోని ఆలూరు గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. గ్రామంలో అనేక సమస్యలు ఉన్నా పట్టించుకునే నాధుడే లేరని సమస్యలు పరిష్కరించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని త్వరలోనే గ్రామ సమస్యలపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని నడిగడ్డ హక్కుల పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో వీధి దీపాలు లేక చీకటిమయం అవుతుందని, డ్రైనేజీ వ్యవస్థ లోపంతో మురుగు మొత్తం నిండి దుర్వాసన వెద జల్లుతుందని, దీని ద్వారా ప్రజలు అనేక రోగాలు బారిన పడే అవకా శం ఉందన్నారు. గ్రామాల్లో సమ యానికి తాగునీరు రాక ఇబ్బం దులు పడుతున్నారని, గ్రామ పంచాయితీ కార్యదర్శి గ్రామ పాలన అభివృద్ధిపై తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని, అదే విధంగా పంచాయతీ వర్కర్లు గ్రామంలో రోడ్లపై ఉన్న చెత్తను తొలగిం చకుండా నీరుగారుస్తున్నారని మండిపడ్డారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కు చుట్టూ కంచె ఏర్పాటు లేక ప్రమాద భరితంగా మారిందని, అధికారులు స్పందించి వెంటనే కంచె ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కొరకై త్వరలోనే జిల్లా కలెక్టర్  దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేస్తామని నడిగడ్డ హక్కుల పోరాట సమితి గ్రామ అధ్యక్షుడు పూల జమ్మన్న తెలిపారు. ఈ కార్యక్రమం లో నడిగడ్డ హక్కుల పోరాట సమితి గ్రామ నాయకులు వెంకట్రాములు, రఘుపతి, వీరన్న,  ఈరన్న వెంకటన్న,  తదితరులు పాల్గొన్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333