గురుకుల పాఠశాలలో విద్యార్థుల భోజనాన్ని పరిశీలిస్తున్న ఎంపీడీవో శంకరయ్య

Feb 5, 2025 - 23:34
Feb 5, 2025 - 23:35
 0  0
గురుకుల పాఠశాలలో విద్యార్థుల భోజనాన్ని పరిశీలిస్తున్న ఎంపీడీవో శంకరయ్య

అడ్డగూడూరు 05 ఫిబ్రవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని మంగమ్మగూడెం గ్రామంలోని గురుకుల పాఠశాలను గురువారం రోజు సందర్శించిన ఎంపీడీవో శంకరయ్య విద్యార్థులకు చదువుతో పాటు నాణ్యమైన భోజనాన్ని అందించాలని అన్నారు.డైనింగ్ ఆల్ పరిసర ప్రాంతం సందర్శించి అక్కడ ఉన్న వస్తువులను వంట పాత్రలను ఎప్పటికప్పుడు శుభ్రంపర్చుకోవాలని అన్నారు. అనంతరం విద్యార్థుల భోజన సమయంలో పరిశీలించి విద్యార్థినిలకు ఆహారాన్ని వడ్డించారు.ఈ కార్యక్రమంలో ఇప్పుడే ఎంపీడీవో శంకరయ్య, ఎం పి ఓ ప్రేమలత స్కూల్ ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు.