కుష్టి వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమ (LCDC-2024) కార్యక్రమాన్ని  ఆకస్మిక తనిఖీ.

డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ సిద్ధప్ప.

Mar 12, 2024 - 20:19
 0  17
కుష్టి వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమ (LCDC-2024) కార్యక్రమాన్ని  ఆకస్మిక తనిఖీ.
కుష్టి వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమ (LCDC-2024) కార్యక్రమాన్ని  ఆకస్మిక తనిఖీ.
కుష్టి వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమ (LCDC-2024) కార్యక్రమాన్ని  ఆకస్మిక తనిఖీ.

జోగులాంబ గద్వాల 12 మార్చ్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల. జిల్లా కేంద్రంలోని తేదీ 12.3.2024 న జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సిద్ధప్ప  సుంకులమ్మ మెట్టు గద్వాల ప్రాంతంలో ""కుష్టు వ్యాధి గ్రస్తులు గుర్తింపు ఉద్యమం""(LCDC -2024) కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.. తేదీ.11.3.2024 నుండి 24.3.2024 వరకు , జోగులాంబ గద్వాల జిల్లాల్లో,ఆశా కార్యకర్తలు ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటి సర్వే ద్వారా అనుమానిత కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించి దగ్గర్లోని ప్రభుత్వాసుపత్రికి రెఫర్ చేస్తారని తెలిపారు.. వైద్య సిబ్బంది ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి 9 గంటల మధ్య ఇంటింటి సర్వే ద్వారా ఈ కార్యక్రమము నిర్వహిస్తారని సూచించారు..  ఈ సర్వేలో ఎవరికైనా "స్పర్శ లేని ఎర్రని రాగి లేదా గోధుమ రంగు గల మచ్చలు "కలిగి ఉండడము అదేవిధంగా" కాళ్లు చేతులలో తిమ్మిర్లు" రావడం ,చెమట రాకపోవడం వంటి లక్షణాలు ఉన్నట్లయితే వారిని దగ్గరలోని ప్రభుత్వాసుపత్రికి రెఫర్ చేస్తారు.. ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు అనుమానిత కుష్టి వ్యాధిగ్రస్తులను పరీక్షించి ఒకవేళ కుష్టు వ్యాధి అని నిర్ధారణ అయితే వెంటనే ఉచితంగా కుష్టు వ్యాధి కి సంబంధించిన మందులు ఇచ్చి చికిత్సలు నిర్వహిస్తారు..


    ఈ కార్యక్రమంలో డాక్టర్. రాజు (PO NCD) K.మల్లికార్జున (DPMO), ప్రేమ్ సాగర్ (DPMO), నర్సమ్మ (PHN), లక్ష్మీదేవి (సూపర్వైజర్) ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333