ఆచరణాత్మక కమ్యూనిస్టు డేగల మధుసూదన్

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ ఎన్ని నిర్బంధాలు వచ్చిన అధిగమిస్తూ విప్లవ పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేసిన ఆచరణాత్మక కమ్యూనిస్టు నాయకుడు ఆత్మకూరు మాజీ సర్పంచ్ డేగల మధుసూదన్ అని అఖిలభారత రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు వి కోటేశ్వరరావు అన్నారు. సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు ఆత్మకూరు మాజీ సర్పంచ్ డేగల మధుసూదన్ 35వ వర్ధంతి సభను శుక్రవారం రాత్రి మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి యువతకు ఆదర్శమని అన్నారు. డేగల మధుసూదన్ కమ్యూనిస్టు నాయకునిగా నిజాం వ్యతిరేక పోరాటంలో పాటు యూనియన్ సైన్యాలకు వ్యతిరేకంగా పోరాడాడని కళాకారునిగా పోరాట యోధునిగా ప్రజలు చెరగని ముద్ర వేశాడని అన్నారు. దేశంలో ప్రశ్నించే వారిని కమ్యూనిస్టులుగా ముద్ర వేసి అణచివేయాలని చూస్తున్నారని ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు. డాక్టర్ కే రంగారెడ్డి అధ్యక్షత న జరిగిన ఈ కార్యక్రమంలో స్పర్శ సామాజిక వేదిక చైర్మన్ కాకి భాస్కర్ డేగల జనార్ధన్ అబ్బగాని బిక్షం డేగల కృష్ణ పోరండ్ల దశరథ కంచనపల్లి సైదులు, గంట నాగయ్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.