ఆశీర్వదించండి గ్రామాన్ని అభివృద్ధి చేస్తా కొమ్ము సోమన్న
ప్రచారం చేయకపోయినా కొమ్ము సోమన్నదే గెలుపు తథ్యం అంటున్న ప్రజలు
జన నిరాజనం పడుతున్న గ్రామ ప్రజలు
ఎమ్మెల్యే సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి లో ముందుకు తీసుకెళ్తాను
నిత్యం పేద ప్రజలకు ఎన్నో సేవలు ....
గుండెపూరి నా గుండె... కొమ్ము సోమన్న
భారీ మెజార్టీతో గెలవడం ఖాయం....
తిరుమలగిరి 07 డిసెంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:
తిరుమలగిరి మండలం గుండెపురి గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కొమ్ము సోమన్న విస్తృతంగా ప్రచారంలో ముందుకు సాగుతూ గెలిచేది మా జెండానే మా పార్టీనే అని ధీమా వ్యక్తం చేశారు మొట్టమొదటిగా 1వ వార్డు లో భారీ ఎత్తున ప్రచారం మొదలుపెట్టారు ఈ సందర్భంగా గ్రామంలో ప్రజలతో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇందిరమ్మ ఇల్లు, ప్రజాపాలన ప్రభుత్వము ప్రతి పేదోడికి వెన్నుదన్ను ఉండి నీడనిచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ధీమా వ్యక్తంచేశారు. గతంలో నా సొంత నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన అని చెప్పారు. ఇప్పుడు గెలిపిస్తే ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో ఉంటూ ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తానని అన్నారు. ఎమ్మెల్యే మందుల సామేల్ సహకారంతో ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేయిస్తామని అన్నారు అనంతరం 1వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేడే సౌజన్య మాట్లాడుతూ నన్ను ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా సిసి రోడ్ కానీ డ్రైనేజీ సమస్యలు కానీ ఇతర సమస్యలు ఉన్న వార్డు అభివృద్ధికి పాటుపడతానని నన్ను ఆదరించాలన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపిస్తారని ఆశ భావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో నరసింహ చారి మురళి శేఖర్ కనకయ్య రాజయ్య రంజిత్ సోమయ్య రమేష్ పూలమ్మ బుజ్జమ్మ నిర్మల, గ్రామ శాఖ నాయకులు తదితరులు పాల్గొన్నారు.....