అతిథి గణిత అధ్యాపకుడి కొరకు దరఖాస్తులకు ఆహ్వానం

జోగులాంబ గద్వాల 4 డిసెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి: మానవపాడు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మానోపాడు లోని గణితశాస్త్ర అతిథి అధ్యాపకుడి కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి శ్రీ యం.హృదయరాజు పత్రికాముఖంగా కోరినారు. అభ్యర్థులకు ఉండవలసిన అర్హతలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో గణిత శాస్త్రము చేసి ఉండవలెను.గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో గణితం లో 50 %శాతం మార్కులకు తగ్గకుండా ఉండాలి. వ్యక్తిగత వివరాలతో SSC మెమో, ఇంటర్మీడియట్,డిగ్రీ పీజీ సర్టిఫికెట్లు జతపరిచి 7- 12- 2024 అనగా శనివారం సాయంత్రం 4 గంటల లోపల జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో సమర్పించాలని ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి శ్రీ యం.హృదయరాజు అభ్యర్థులను పత్రికా ముఖంగా కోరారు .