అడ్డగూడూరు మండల సమగ్ర అభివృద్ధికై పోరాడుతాం

Aug 9, 2025 - 12:56
 0  10
అడ్డగూడూరు మండల సమగ్ర అభివృద్ధికై పోరాడుతాం
అడ్డగూడూరు మండల సమగ్ర అభివృద్ధికై పోరాడుతాం

*అడ్డగూడూరు మండల సమగ్ర అభివృద్ధికై పోరాడుతాం సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి*

అడ్డగూడూరు 08 ఆగస్టు 2025 తెలంగాణవార్త రిపోర్టర్:–

మండల కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ)మండల కౌన్సిల్ ఆధ్వర్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ నాలుగవ జిల్లా మహాసభలలో నూతన జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన యానాల దామోదర్ రెడ్డి సహాయ కార్యదర్శిలుగా ఎన్నికైన బోలగాని సత్యనారాయణ చేడే చంద్రయ్యకు సన్మాన కార్యక్రమం మండల కార్యదర్శి రేకల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది.మండల కౌన్సిల్ వివిధ గ్రామ శాఖల కార్యదర్శుల ఆధ్వర్యంలో సన్మానం నిర్వహించడం జరిగింది.అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి మాట్లాడుతూ..యాదాద్రి భువనగిరి జిల్లాలో అడ్డగూడూరు చివరి మండలం కావడంతో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది నియోజకవర్గం తుంగతుర్తి సూర్యాపేట జిల్లాలో ఉంది.ఈ ప్రాంతం నుండి గతంలో అనేకమంది ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ప్రాతినిధ్యం వహించిన అభివృద్ధి మాత్రం శూన్యం గత ప్రభుత్వం ఇక్కడికి మాండలిక వ్యవస్థ తీసుకొచ్చిన అద్దే భవనాలలో ప్రభుత్వ కార్యాలయాలు నడుస్తున్నాయి ఇక్కడి ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలు లేక సరిపడా అధికారులు లేక ఇబ్బందులు పడుతున్నారు అని అన్నారు.

ఈ ప్రభుత్వం ఇప్పటికైనా అడ్డగూడూరు మండలానికి సొంత కార్యాలయాలు ఏర్పాటు చేసి ప్రజల అవస్థలు తీర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సమస్యలపై జిల్లా కలెక్టర్ ప్రజా ప్రతినిధుల వద్దకు తీసుకెళ్లి సమస్య పరిష్కారానికై మండల సమగ్ర అభివృద్ధికై సిపిఐ జిల్లా సమితి పోరాడుతుందని ఆయన తెలిపారు.ప్రధానంగా ఈ మండలానికి రావలసిన పునాది గాని కాలువను పూర్తి చేసి ధర్మారం వరకు నీటిని విడుదల చేయాలనే డిమాండ్ తో పోరాటం నిర్వహిస్తామని ఈ కాలువ ఇక్కడికి వచ్చినట్లయితే రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.సహాయ కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ.. ఈ మధ్యకాలంలో బీసీ రిజర్వేషన్లు అనేవి చాలా ప్రాముఖ్యతను చాటుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న బీసీలకు 42 శాతం నిర్ణయాన్ని బిజెపి అస్ఫ్రష్టత కారణంగా రిజర్వేషన్లను తొక్కిపట్టాలని బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది బీసీ రిజర్వేషన్ అయోమయంతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించక గ్రామాలకు కేంద్రం నుండి రావాల్సిన నిధులు ఆగిపోయాయి అని వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బిసి రిజర్వేషన్లను 42 శాతం పెంచి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నామని అన్నారు.సహాయ కార్యదర్శి చెడే చంద్రయ్య మాట్లాడుతూ.. అడ్డగూడూరు ప్రాంతంలో భూస్వాముల ఆగడాలని వ్యతిరేకిస్తూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో 600 ఎకరాల పెద్ద రేగడిని పేదలకు పంచిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీకి ఉందని ఆయన అన్నారు. 

మండలంలోని అన్ని గ్రామాలలో సిపిఐ ప్రజా సంఘాలు ఏర్పాటు చేసి పార్టీ శాఖలను బలోపేతం చేసుకోవాలని స్థానిక సంస్థల ఎన్నికలలో సిపిఐ పార్టీ అధిక స్థానాలను గెలుచుకోవాలని ఆయన అన్నారు.మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు పక్క భవనాలు నిర్మాణం చేసి ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఉప్పుల శాంతి కుమార్ మండల కౌన్సిల్ సభ్యులు కందుకూరి వెంకన్న బొనుగసుదర్శన్ రెడ్డి బెల్లి శ్రీకాంత్ సోలిపురం నాగిరెడ్డి చెడే సుందరయ్య శీలం వెంకన్న తీగల సైదులు మార్త వీరయ్య ఉప్పుల శివ చారి తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333