మేడి ఫౌండేషన్ చైర్మన్ ఎమ్మార్పీఎస్ ఉద్యమ నేత మేడి కృష్ణ మాదిగ ఘనంగా జన్మదిన వేడుకలు

Aug 8, 2025 - 21:14
 0  10
మేడి ఫౌండేషన్ చైర్మన్ ఎమ్మార్పీఎస్ ఉద్యమ నేత మేడి కృష్ణ మాదిగ  ఘనంగా జన్మదిన వేడుకలు

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ మేడి ఫౌండేషన్ చైర్మన్ ఎమ్మార్పీఎస్ ఉద్యమ నేత మేడి కృష్ణ మాదిగ ఘనంగా జన్మదిన వేడుకలు ఆత్మకూరు మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మేడి ఫౌండేషన్ చైర్మన్ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు మేడి కృష్ణ మాదిగ మేడి కృష్ణ మాదిగ జన్మదిన వేడుకల సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో MSP జిల్లా అధ్యక్షులు యాతాకుల రాజన్న మాదిగ కళానేత గంట బిక్షపతి మాదిగ ఎమ్మార్పీఎస్ సీనియర్ జిల్లా నాయకులు బొడ్డు విజయ్ కుమార్ పాల్గొని అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే సేవా దృక్పథాన్ని అలవర్చుకొని కన్న తల్లిదండ్రులే దైవ సమానులుగా భావించి సూర్యాపేట జిల్లా పరిధిలో పలు సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి మన్నలను పొందుతూ నిస్సహాయులకు నీడగా పేదలకు పెన్నిధిగా మేడి ఫౌండేషన్ ఏర్పాటు చేసి రకరకాల సేవలందిస్తున్న మేడి కృష్ణ మాదిగ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అంచలంచలుగా ఎదిగి భవిష్యత్తులో మంచి స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని కోరడం జరిగింది.