మహిళా దినోత్సవం సందర్భంగా భద్రాద్రి బ్లడ్ డొనేషన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రక్తదానం
*మహిళా దినోత్సవం సందర్భంగా భద్రాద్రి బ్లడ్ డొనేషన్ ఆర్గనైజేషన్(బిబిడిఓ) ఆధ్వర్యంలో రక్తదానం*
భద్రాచలం:
ఈ సమాజంలో మహిళ అమోఘమైన పాత్రను పోషిస్తుంది. ప్రతి స్త్రీ కూడా అమ్మ స్థానంలో రక్తాన్ని పంచి, ఈ సమాజాన్ని తీర్చిదిద్దుతుంది. మార్చ్ 8 మహిళా దినోత్సవం సందర్భంగా, ప్రతి ఒక్కరూ అమ్మ స్థానంలో ఉంటే, అటువంటి "అమ్మ మనకు జన్మనిస్తే, ఆపత్కాల సమయంలో రక్తాన్ని దానం చేసిన వారు పునర్జన్మ ని ఇస్తారు". ప్రతి జీవి దేహంలో రక్తం లేకపోతే నిర్జీవమైపోతారు. అటువంటి రక్తదానాన్ని ఒక యజ్ఞంలా నిర్వహించడానికి భద్రాద్రి బ్లడ్ డొనేషన్ ఆర్గనైజేషన్ ముందుకు రావడం ఎంతో సంతోషించదగిన అంశం. అత్యంత ప్రమాదకరమైన ప్రాణాపాయ స్థితిలో ఉండి రక్తం కొరతతో ఇబ్బంది పడుతున్న రోగులకు అన్నివేళలా సహాయం చేయాలని మానవతా దృక్పథంతో, మానవాళిని రక్షించుకోవడంలో ఎవరికి వారు స్వీయ నిర్ణయంతో రక్తదానం చేయడం మానవ సంక్షేమానికి, "రక్తం దానం చేయండి ప్రాణాన్ని నిలబెట్టండి" అనే నినాదంతో ముందుకు వెళుతూ భద్రాచలం ప్రభుత్వ హాస్పిటల్ లో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజాపూర్ జిల్లా లో రాంపురం గ్రామానికి చెందిన కుంజం పాండే అనే యువతికి ప్రమాదవశాత్తు బాంబ్ మీద కాలు పడి బాంబ్ పేలి తన కాలు నుజ్జు నుజ్జు అవడంతో వెంటనే ఆపరేషన్ కోసం భద్రాచలం హాస్పిటల్ కి తరలించారు, హాస్పిటల్ సూపరింటెండెంట్ వెంటనే రక్తం కావాలి అని కోరడం తో భద్రాద్రి బ్లడ్ డొనేషన్ ఆర్గనైజేషన్ సంస్థలో ఆర్గనైజర్ గా పని చేస్తూ రక్తదానం అందించి, ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు గుగులోతు బాబు. ఈ సందర్భంగా భద్రాద్రి బ్లడ్ డొనేషన్ ఆర్గనైజేషన్ (బిబిడిఓ) ఫౌండర్ గుజ్జులా వేణు గోపాల్ రెడ్డి, గుగులోతు బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ఉత్సాహంగా ముందుకు వచ్చి ఈ సమాజాన్ని రోగరహిత, రక్త కొరత లేనిసమాజంగా తీర్చిదిద్దడంలో వారి వారి పాత్రను పోషిస్తే, మానవాళి ఆరోగ్యం, ఆయుష్షు, పది కాలాలు పెంచుకున్న వారమవుతాము. ఈ కార్యక్రమం లో గుజ్జులా వేణు గోపాల్ రెడ్డి ఫౌండర్ బిబిడిఓ, పొడుతురి ప్రేమ్ సాయి ఆర్గనైజర్ బిబిడిఓ, గుగులోతూ బాబు ఆర్గనైజర్ బిబిడిఓ.