గట్టు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో దరఖాస్తుల స్వీకరణ.
గట్టు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో దరఖాస్తుల స్వీకరణ...:ప్రిన్సిపాల్ పి.శశిధర్ రెడ్డి

జోగులాంబ గద్వాల 20 మే 2024 తెలంగాణవార్త ప్రతినిధి.:- గట్టు. మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల గట్టు లో ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ పి.శశిధర్ రెడ్డి సోమవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు కళాశాలలో చేరేందుకు అర్హులని,మొదటి విడత మే31 వ తేది వరకు ధరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఆయన తెలిపారు. జూన్ ఒకటి నుంచి కళాశాలలో తరగతులు ప్రారంభం అవుతాయన్నారు.కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసి, గ్రూప్‌లు మరియు ఒకేషనల్ కోర్సులకు సంబంధించి MLT ,MPHW గ్రూప్‌లు ఉన్నాయని, విద్యార్థులకు స్కాలర్‌షిప్, ఉచి తంగా పాఠ్యపుస్తకాలు అందుతాయని సద్వినియోగం చేసుకోగలరని ఆయన తెలిపారు.